Trends

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్ అవ్వగా.. అందులో గ్రూప్ 1 ఇప్పుడందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ఈ గ్రూపులో ఉన్న నాలుగు జట్లు కూడా లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ‘అన్‌బీటెన్’గా దూసుకొచ్చినవే. భారత్ తో పాటు వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే జట్లు ఈ గ్రూపులో ఉండటంతో పోరు అత్యంత కఠినంగా మారనుంది.

గ్రూప్ ఏ నుంచి భారత్ వరుసగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌లపై గెలిచి టీమిండియా పక్కా ప్లానింగ్‌తో సూపర్ 8కు చేరింది. అటు గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, గ్రూప్ డి నుంచి సౌత్ ఆఫ్రికా కూడా నాలుగుకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి తమ బలాన్ని చాటాయి. ఇక ఈ గ్రూపులో అందరినీ ఆశ్చర్యపరిచిన టీమ్ జింబాబ్వే. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి జట్లకు షాక్ ఇచ్చి ఈ స్థానాన్ని దక్కించుకుంది.

ఈ గ్రూప్ 1ను చూస్తుంటే ‘డెత్ గ్రూప్’ అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే లీగ్ దశలో ఒక ఊపు ఊపిన జట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ నాలుగు జట్లలో ఏ రెండు జట్లు సెమీ ఫైనల్‌కు వెళ్తాయనేది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఇక టీమిండియా నుంచి ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే సూపర్-8లో జరిగే ప్రతి మ్యాచ్ ఇప్పుడు ఫైనల్ అంత ఉత్కంఠను రేపుతోంది.

ముఖ్యంగా జింబాబ్వే ప్రదర్శన పట్ల మిగిలిన జట్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి పటిష్టమైన టీమ్‌లను ఇంటికి పంపించిన ఆత్మవిశ్వాసంతో వాళ్లు ఉన్నారు. ఇటు భారత్ కూడా సరైన బౌలింగ్, బ్యాటింగ్ లైనప్‌తో బలంగా కనిపిస్తోంది.

ఈ గ్రూప్ నుంచి క్వాలిఫై అయ్యే జట్లు కచ్చితంగా వరల్డ్ కప్ గెలిచే మొమెంటమ్‌ను సొంతం చేసుకుంటాయని చెప్పవచ్చు. నిజానికి లీగ్ దశలో చూపించిన ఫామ్ ఇక్కడ కూడా కొనసాగించడం అంత సులభం కాదు. పెద్ద జట్లు ఒకే గ్రూపులో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. మరి ఈ అన్‌బీటెన్ జట్ల పోరులో చివరకు ఎవరు నిలుస్తారో చూడాలి.

This post was last modified on February 20, 2026 12:24 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago