హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నీలగిరి బ్లాక్‌లోని నాలుగో అంతస్తులో పనిచేస్తున్న ఓ కోచింగ్ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థులు లోపలే చిక్కుకుపోయారు.
మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. భవనం సమీపంలోనే ఉన్న హైదరాబాద్ మెట్రో మార్గం వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నిచ్చెనల సహాయంతో నాలుగో అంతస్తు బాల్కనీలో నిలబడి సహాయం కోరుతున్న విద్యార్థులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ముఖాలకు ముసుగులు ధరించి, దట్టమైన పొగ మధ్య సిబ్బంది ధైర్యంగా లోపలికి ప్రవేశించి రక్షణ చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలు మరింత వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్‌లోని విద్యుత్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.
This post was last modified on February 20, 2026 1:00 pm
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…