షాకింగ్.. కేంద్రమంత్రికి వేధింపులు

షాకింగ్.. కేంద్రమంత్రికి వేధింపులు

మ‌హిళ‌ల భ‌ధ్ర‌త గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో సంచ‌ల‌న‌ సంఘ‌ట‌న తెర‌మీద‌కు వ‌చ్చింది.  గతేడాది మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతోనూ ఢిల్లీలో నలుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. తాజాగా అదే రీతిలో కేంద్రమంత్రి హోదాలో ఉన్న ఓ  నాయ‌కురాలికి తీవ్ర ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామాలు ఏర్పాడ్డాయి. ఓ సాధారణ మహిళను వేధించినట్లే కొందరు యువకులు ఆమెను కూడా వేధించారు. కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ స్థానం మీర్జాపూర్ నుంచి వారణాసి వెళ్తున్న సమయంలో కొందరు యువకులు ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డారు. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఆమె వంత‌యింది.

తన నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వార‌ణాసికి కేంద్ర‌మంత్రి అనుప్రియ ప‌టేల్‌ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఓ నంబర్ ప్లేట్ లేని కారులో ముగ్గురు యువకులు దూసుకొచ్చారు. వాళ్లను మంత్రి భద్రతా సిబ్బంది వారించారు. అయినా అలాగే కాన్వాయ్‌ను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ.. అనుప్రియ పటేల్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. సెక్యూరిటీ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. ఆమె వారణాసి చేరుకోగానే నేరుగా ఎస్పీ భరద్వాజ్‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి ఫిర్యాదు నేప‌థ్యంలో అగంత‌కుల‌ను పట్టుకోవడానికి ప్రత్యేకంగా డ్రైవ్ ఏర్పాటు చేశారు. మీర్జామురాద్‌లో వాళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న ఈవ్ టీజింగ్‌ను అరికట్టడానికి యోగి సీఎం కాగానే యాంటీ రోమియో స్కాడ్‌లను ఏర్పాటు చేశారు. అయినా ఈ ఏడాదిన్నరలో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. పైగా కేంద్ర‌మంత్రికే వేధింపులు ఎదురుకావ‌డం క‌ల‌క‌లంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English