మేకపాటిపై జగన్‌ ఆగ్రహం!

మేకపాటిపై జగన్‌ ఆగ్రహం!

జైల్లో ఉన్న జగన్మోహన రెడ్డికి కోపం వచ్చింది. నిజానికి ఇప్పుడు తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసుకుంటే ఆయనకు ఒక కోపం కాదు.. చాలా కోపాలు రావాలి. కానీ ఒక కోపం మాత్రం బయటకు పొక్కింది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి పరిధిలో.. ఆయన సొంత గ్రామం అయిన పంచాయతీలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించకపోవడాన్ని జగన్‌ సీరియస్‌గా పట్టించుకున్నట్లు తెలిసింది.

గత ఉప ఎన్నికల్లో మేకపాటి రాజమోహనరెడ్డి.. అదివరకు సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటె చాలా వ్యత్యాంసతో మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. అది కూడా కాంగ్రెసు పార్టీ తిక్కవరపు సుబ్బరామిరెడ్డిని పోటీగా మోహరించి.. కోట్లాది రూపాయలు ఖర్చుచేసినా  కూడా మేకపాటి మంచి మెజారిటీ సాధించారు. వైకాపా అంటే సహజంగా ఉండే బలానికి మేకపాటి బలం కూడా తోడైందని అప్పట్లో అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి తిరగబడిరది. పంచాయతీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైకాపాకు ఆధిక్యం దక్కలేదు సరి కదా.. మూడు లక్షల మెజారిటీ సాధించిన ఎంపీ.. సొంత పంచాయతీని చేజార్చుకున్నారు.ఇది ప్రజలకు చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుందని జగన్‌ భావించినట్లు సమాచారం. నాయకులు పార్టీకి దన్నుగా నిలవాలి గానీ.. పార్టీకి ఉన్న ఇమేజి కూడా నాయకుల వల్ల భంగపడేలా పరిస్థితి తయారు కాకూడదన్నట్లుగా జగన్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకుల మీద కూడా జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి మీద కన్నేసిన వ్యక్తిగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇద్దరికీ చెందిన చిత్తూరు జిల్లా మీద వైఎస్‌ జగన్‌ తొలినుంచి కడప తర్వాత అత్యంత శ్రద్ధతో కాన్సంట్రేట్‌ చేస్తున్నారు. అక్కడ కూడా తమకే మెజారిటీ సీట్లు వచ్చినట్లుగా.. సాక్షి ప్రకటించింది వాస్తవానికి ఆ జిల్లాలో తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు దక్కినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై కూడా జగన్‌ కినుకగానే ఉన్నారట. తన నెలవు కడపజిల్లాలోనే కాదు, ప్రత్యర్థుల నెలవు అయిన చిత్తూరు జిల్లాలో కూడా పార్టీ ఏమాత్రం బలహీన పడడానికి వీల్లేదని పేర్కొన్నట్లు సమాచారం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English