మంచు ఫ్యామిలీ కంచె దాటుతుందా?

మంచు ఫ్యామిలీ కంచె దాటుతుందా?

ఒకప్పుడు అగ్ర హీరోల చిత్రాలకి ధీటైన విజయాలని మోహన్‌బాబు అందుకున్నారు. అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, పెదరాయుడు లాంటి భారీ విజయాలని సాధించి 'కలెక్షన్‌ కింగ్‌' అనిపించుకున్నారు. అదే స్టార్‌డమ్‌ని ఆయన పిల్లలు అందుకోలేకపోయారు. విష్ణు ఢీ, దేనికైనా రెడీ లాంటి విజయాలు అందుకున్నా కానీ కన్సిస్టెన్సీ చూపించలేకపోతున్నాడు.

మంచు మనోజ్‌, మంచు లక్ష్మిల చిత్రాలకి కూడా ఈమధ్య వసూళ్లు వుండడం లేదు. ఈ నేపథ్యంలో వస్తోన్న మోహన్‌బాబు చిత్రం 'గాయత్రి' ఆకట్టుకునే ప్రోమోలతో బాగానే ఆకర్షిస్తోంది. మోహన్‌బాబు ఇందులో విలనిజం పండించే హీరో పాత్రలో కనిపిస్తున్నారు. కొంతకాలంగా మంచు సినిమాలకి ఓపెనింగ్స్‌ కూడా బాగా తగ్గిన నేపథ్యంలో గాయత్రి ఫలితం వారికి చాలా కీలకం.

ఈ చిత్రంతో మళ్లీ బాక్సాఫీస్‌ వద్ద మంచు హవా మొదలవుతుందని లక్ష్మీప్రసన్న కాంపౌండ్‌ ఎదురు చూస్తోంది. ఈ చిత్రానికి సోలో రిలీజ్‌ దక్కలేదు. మరో రెండు చెప్పుకోతగ్గ సినిమాలైన తొలిప్రేమ, ఇంటిలిజెంట్‌తో పాటు రిలీజ్‌ అవుతోన్న గాయత్రి ఈ త్రిముఖ పోటీలో ఎలా రాణిస్తుందనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English