ఆమెను డబ్బింగ్ లో చూసి సంబరపడండి

ఆమెను డబ్బింగ్ లో చూసి సంబరపడండి

ఆమెను డబ్బింగ్ లో చూసి సంబరపడండి

తెలుగులో సౌందర్య తర్వాత అంత మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యా మీనన్. మలయాళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో చేసిన తొలి సినిమా ‘అలా మొదలైంది’లోనే చక్కగా డబ్బింగ్ చెప్పుకుని.. మంచి అభినయంతో మన ప్రేక్షకుల్ని మెప్పించింది నిత్య. ఆ తర్వాత కూడా ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాలతో మురిపించింది నిత్య. ఆమెకు తెలుగులో భారీగానే అభిమానగణం తయారైంది.

ఐతే చిన్న, ఓ మోస్తరు స్థాయి సినిమాలు చేస్తున్నంత కాలం బాగానే సాగిన నిత్య కెరీర్.. పెద్ద సినిమాల్లో చేయడంతోనే గాడి తప్పింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాల్లో ప్రాధాన్యం లేని పాత్రలు చేసిన తన ప్రత్యేకతను కోల్పోయింది నిత్య. ఈ రెండు సినిమాల తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలే లేవు. ఏడాదిగా తెలుగు తెరపై నిత్య కనిపించనే లేదు. తెలుగులో నిత్య కెరీర్ దాదాపుగా ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. ఇది ఆమె అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసే విషయమే.

ఐతే నిత్యను ఇక మళ్లీ చూడలేమని ఫీలవుతున్న అభిమానులకు.. ఆమెను ఓ డబ్బింగ్ సినిమా ద్వారా చూసే అవకాశం లభిస్తోంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా ‘మెర్సల్’లో నిత్య ఓ కీలక పాత్ర చేస్తోంది. విజయ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఓ పాత్రకు నిత్య జోడీగా నటిస్తోంది.

తాజాగా విజయ్-నిత్య కలిసి పిల్లాడితో ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో నిత్య ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటోంది. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘అదిరింది’ పేరుతో పవన్ కళ్యాణ్ మిత్రుడు శరత్ మరార్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీపావళికి రెండు భాషల్లోనూ ఒకేసారి ఈ చిత్రం విడుదలవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు