Political News

నాడు బాబు-నేడు జ‌గ‌న్: వ్యూహం ఒక‌టే పైచేయి ఎవ‌రిది?

ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేయ‌డం అనేది రాజ‌కీయాల్లో కామ‌నే. అయితే, ఈ విష‌యంలో వ్య‌క్తిగ‌తంగా కూడా టార్గెట్లు చేసుకోవ‌డం, పార్టీ అధినేత‌లే.. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించాల‌ని అనుకోవ‌డం, ఒక‌రిని ఓడించాల‌ని మ‌రొక‌రు భావించ‌డం వంటివి.. వైసీపీ-టీడీపీల్లో క‌నిపిస్తున్న ప‌రిణామం. సాధార‌ణంగా.. ఒక పార్టీకి చీఫ్‌గా ఉన్న‌వారిని ఓడించేందుకు ఇత‌ర పార్టీలు సాధార‌ణంగా ప్ర‌త్యేకంగా ల‌క్ష్యాన్ని పెట్టుకోవు. రాజ‌కీయంగా దూకుడు అనేది వేరే శైలిలో ఉంటుంది. కానీ, గ‌త ఐదేళ్ల‌కాలంలో చంద్ర‌బాబు …

Read More »

ఏపిలో కేంద్రాన్ని ప్రశ్నించే వాళ్లే లేరా ? అకాలీదళ్ నిర్ణయంపై చర్చ

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పైగా తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని అకాలీదళ్ పార్టీ నిర్ణయం తర్వాత అనుమానాలు కావని నిజాలే అని జనాల్లో చర్చ మొదలైపోయింది. అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ మీడియాతో మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగానే తాము ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించారు. అకాలీదళ్ తాజా నిర్ణయంతో ఎన్డీఏతో ఉన్న 23 ఏళ్ళ …

Read More »

సోము కాపు జ‌పం.. ఆ రెండు జిల్లాల‌పై ఫోక‌స్‌

గ‌తానికి భిన్నంగా రాష్ట్ర బీజేపీ అడుగులు వేస్తోందా? ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌.. ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారా? ఈ క్ర‌మంలో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. రాష్ట్రంలోని ప‌ద‌మూడు జిల్లాల్లోనూ ఒక జిల్లాకు మ‌రో జిల్లాకు మ‌ధ్య పోలిక‌లు లేవు. ఒక జిల్లాలో ఉన్న స‌మ‌స్య‌లు మ‌రో జిల్లాలో పెద్ద‌గా క‌నిపించ‌వు. సో.. ఈ నాడిని ప‌ట్టుకున్న సోము.. …

Read More »

వెల్లంపల్లికి కరోనా !! బ్రహ్మోత్సవాల్లో జగన్ తో ఉన్నారే!

దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా వైరస్ సోకింది. బ్రహ్మోత్సవాల్లో బిజి బిజిగా గడిపిన మంత్రి విజయవాడకు ఈనెల 25వ తేదీన తిరిగొచ్చారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 19వ తేదీనుండి మంత్రి తిరుమలలోనే ఉన్నారు. మధ్యలో అంటే 23వ తేదీన గరుడోత్సవం రోజున జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. జగన్ తిరుమలకు వచ్చి తిరిగి వెళ్ళేంతవరకు వెల్లంపల్లి సిఎంతోనే ఉన్నారు. అంటే ఇదే …

Read More »

పార్టీ మారేందుకు ఆమె రెడీ?

పార్టీలు మార‌డం, రాజ‌కీయంగా కొత్త రుచులు చూడడం ఇప్పటి నేత‌ల‌కు అల‌వాటే. అవ‌కాశం-అధికారం.. ఈ రెండు కీల‌క సూత్రాలుగా నాయ‌కులు త‌మ దారులు తాము చూసుకునేరోజులు ఇవి. ఈ క్ర‌మంలో పార్టీలు మారుతున్నా.. ప్ర‌జ‌లు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు మ‌రో ఛాన్స్ కోసం అంటూ.. కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి.. టీడీపీ నుంచి జంప్ చేసేందుకు రెడీ అయ్యార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి కాంగ్రెస్‌లో ఆమె …

Read More »

టీడీపీ … బ్యాక్ టు బీసీ !

లోక్ సభ నియోజకవర్గాలకు తెలుగుదేశంపార్టీ నియమించిన అధ్యక్షుల్లో పదిమంది బిసీలే ఉన్నారు. పార్టీని పటిష్టంచేసే క్రమంలో ఇపుడున్న జిల్లాల అధ్యక్షుల స్ధానంలో ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే 13 జిల్లాల అధ్యక్షుల స్ధానంలో చంద్రబాబునాయుడు 25 మంది అధ్యక్షలను నియమించారు. వీరిలో 10 చోట్ల బీసీలనే నియమించారు. ఇందులో కూడా ప్రధానంగా యాదవులకే ప్రాధన్యత ఇవ్వటం గమనార్హం. ఇంతమంది బీసీలకు …

Read More »

డ్రాగన్ కు షాకిచ్చిన భారత్.. చలి కూడా ఏమి చేయలేకపోతోందా ?

డ్రాగన్ సైన్యాలకు మన సైన్యాలు పెద్ద షాకే ఇచ్చాయి. శీతాకాలం మొదలైంది కదా భారత్ సైన్యాలు వెనక్కు వెళ్ళిపోతాయని చైనా ఆశించింది. కానీ మైనస్ డిగ్రీల చలిని సైతం తట్టుకునే ఏర్పాట్లు చేసుకున్న మన సైన్యాలు ఉన్నచోట నుండి ఎక్కడికి కదలకుండా ఉన్నచోటే కూర్చున్నాయి. అంతేకాకుండా యుద్ధ అవసరాలను కూడా మరింతగా పెంచుకోవటం చూసిన డ్రాగన్ కు షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో ఏమి చేయాలో తెలీక బిత్తరపోయిన చైనా సైన్యం …

Read More »

అమరావతి పై కీలక వ్యాఖ్యలు చేసిన చిన్నమ్మ

ఏపీ రాజధానిగా అమరావతిపై బీజేపీ స్టాండ్ ఏమిటి? అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఓవైపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించే సోము వీర్రాజు ఏమో.. ఏపీ రాజధాని అమరావతినే అని చెబుతారు. మరోవైపు రాజధాని అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసే వేళలో ఏపీ రాష్ట్రానికే ఆ నిర్ణయాధికారం అని చెప్పటం.. ఈ డబుల్ స్టాండ్ ఏమిటన్న దానిపై భారీగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. జాతీయ …

Read More »

ప‌ద‌వులు స‌రే.. ప‌టిష్ట వ్యూహం ఏదీ? టీడీపీపై చ‌ర్చ‌

ఏపీ టీడీపీని సంస్క‌రించాలి. పార్టీని ప‌టిష్టం చేయాలి. క్షేత్ర‌స్థాయిలో కోల్పోయిన‌, కోల్పోతున్న విశ్వాసాన్ని మ‌రింత ప్రోది చేయాలి!- ఇదీ.. గ‌డిచిన ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత‌.. అన్ని జిల్లాల నుంచి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు అందిన నివేదిక‌ల సారాంశం. అంటే.. దీనిని బ‌ట్టి.. పార్టీ ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలో.. ఎలా వ్యూహాత్మ‌క అడుగులు వేయాలో కొంత మేర‌కు అర్ధం అవుతూనే ఉంది. మాట‌లు కాదు.. చేతులు కావాలి! …

Read More »

చంద్రబాబుకు డేంజర్ బెల్స్..పెరిగిపోతున్న ప్రత్యేక గ్రూపు

అసెంబ్లీలో చంద్రబాబునాయుడుకు డేంజన్ బెల్స్ మోగేట్లే ఉన్నాయి. టీడీపీకి రాజీనామా చేసిన ఎంఎల్ఏలందరు అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా తయారవుతున్నారు. ఇప్పటికి ప్రత్యేక గ్రూపుగా తయారైన ఎంఎల్ఏల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మొదటగా పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ తనను అసెంబ్లీలో ప్రత్యేక సభ్యునిగా పరిగణించాలని రిక్వెస్ట్ చేశారు. తనకు టీడీపీకి సంబంధం లేదని కాబట్టి అసెంబ్లీ తాను టీడీపీ సభ్యులతో కలిసి కూర్చునే అవకాశం లేదన్నారు. కాబట్టి తనను …

Read More »

అందుకే కదా చైనాను రోగ్ నేషన్ అనేది

ఇందుకే ప్రపంచదేశాల్లో చైనాకు రోగ్ నేషన్ అని పేరుపడిపోయింది. ఎక్కడవకాశాలుంటే అక్కడల్లా భూభాగాలను కబ్జా చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నది డ్రాగన్ దేశం. దశాబ్దాల క్రితం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకున్నది. ఆ తర్వాత పాకిస్ధాన్ భూముల్లో జెండాలు పాతింది. వ్యాపారం పేరుతో శ్రీలంకలో కూడా భూములను తీసుకుంది. తనకు ఇంతకాలం మద్దతుగా నిలబడ్డ నేపాల్ ను కూడా వదల్లేదు. నేపాల్ లోని భూభాగంలోకి చొచ్చుకుపోవటంతో అక్కడి జనాలు గగ్గోలు పెడుతున్నారు. …

Read More »

పురంధరేశ్వరి, డీకే అరుణలకు కీలక పదవులు

2019 ఎన్నికలలో దేశవ్యాప్తంగా బీజేపీ హవా వీచిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ…2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే పార్టీకి కొత్తరూపు కల్పించేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పరిచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన కార్యవర్గం జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో నలుగురు …

Read More »