రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోందనే నిష్టుర సత్యాలు పార్టీని కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఈ వ్యతిరేకతను తగ్గిం చుకుని పార్టీని పుంజుకునేలా చేయాలని పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా పాతిక జిల్లాలు చేస్తానని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని.. …
Read More »చంద్రబాబు ఆలోచన మంచిదే.. వైసీపీనే తడబడుతోంది!
అవును! ఇప్పుడు ఈ మాటే సర్వత్రా వినిపిస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ నేతలు.. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలను సరిగా అర్ధం చేసుకోలేక పోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలేనని అంటున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇటీవల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన జరిగింది. దీనికి పోలీసుల వేధింపులే కారణమని అన్ని పక్షాల నాయకులు సహా స్థానిక …
Read More »రాంజీ రాకకు సర్వం సిద్ధం.. బాబు కూడా మౌనం!
అధికార వైసీపీ గూటికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ మాగంటి బాబు కుమారుడు, ప్రస్తుత టీడీపీ జిల్లా యువత అధ్యక్షుడు మాగంటి రాంజీ రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మాగంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అలంకరించింది. అదేసమయంలో టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఎంపీగా బాబు …
Read More »రాజకీయాల నుండి ఈ సీనియర్ రిటైర్ అయినట్లేనా ?
తెలుగుదేశంపార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. రాజమండ్రి నుండి ఈయన ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు అన్నగారి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. మధ్యలో రాజకీయ జీవితం కాస్త కుదుపులకు లోనైనా మళ్ళీ సర్దుకున్నది. తాజాగా మీడియా సమావేశం పెట్టిన బుచ్చయ్య తన రాజకీయ వారసుడిని ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన …
Read More »రేవంత్ కు ఇవ్వక తప్పదంటున్నారు
రేవంత్ రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవిని అప్పగిస్తారా ? కాంగ్రెస్ పార్టీలో ఇదే విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్చొచ్చింది. బీజేపీ అభ్యర్ధి రఘునందనారావు అనూహ్యంగా విజయం సాధించారు. రెండో స్ధానంలో టీఆర్ఎస్ సరిపెట్టుకోగా హస్తంపార్టీ మాత్రం మూడోస్ధానంతో సర్దుకోవాల్సొచ్చింది. సరే దీనికి కారణాలు చాలానే ఉన్నా బాధ్యత మాత్రం పిసీసీ ప్రెసిడెంట్ దే అవుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుత అధ్యక్షుడు …
Read More »ఎవరిని ఎవరు వదిలేశారు ?
ఈ విషయమే తెలుగుదేశంపార్టీలో ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీ అధికారానికి దూరమైనా మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ లో గెలిచారు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే గంటా తనదైన రాజకీయం మొదలుపెట్టేశారు. టీడీపీకి రాజీనామా చేస్తారని, వైసీపీలో చేరుతారనే ప్రచారం గంటా విషయంలో జరిగినట్లుగా మరే టీడీపీ నేతపైనా జరగలేదంటే …
Read More »మాజీ మంత్రికి తప్పని సెగ.. టీడీపీలో రచ్చరచ్చ
టీడీపీలో అసంతృప్తులను తగ్గించాలని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ, వ్యూహాలపై వ్యూహాలు అమలుచేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో చంద్రబాబు వ్యూహాలు ఫలించడం లేదని అంటున్నారు సీనియర్ నాయకులు. ముఖ్యంగా మాజీ మంత్రి జవహర్ విషయంలో చంద్రబాబు ఆలోచనా విధానాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నేతలు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. తాజాగా జవహర్‌కు వ్యతిరేకంగా లేఖల యుద్ధాన్ని ప్రారంభించారు. దీంతో కొవ్వూరు టీడీపీ రాజకీయాలు మరోసారి ఆసక్తిగా మారాయి. 2014 …
Read More »జగన్‌ను కాదని..బాబుపై బీజేపీ యుద్ధం. రీజనేంటి?
రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడం కష్టం. గతంలో చంద్రబాబు సర్కారు ఏపీలో పాలన సాగిస్తున్న సమయంలో రంగంలోకి దిగిన జనసేన నాయకుడు పవన్.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడం మానేసి.. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీపైనా.. ఆ పార్టీ అధినేత జగన్ పైనా విరుచుకుపడ్డారు. అప్పట్లో అందరూ దీనిని చిత్రంగా చర్చించుకున్నారు. వ్యూహం ఏమిటనేది ఇప్పటికీ చాలా మందికి అంతుపట్టదు! కట్ చేస్తే.. ఇప్పుడు బీజేపీ …
Read More »ఈనేత పక్క చూపులు చూస్తున్నారా ?
పార్టీలో ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇపుడిదే చర్చ నడుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ఈ మాజీ ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు @ మాగంటి బాబు ఇప్పుడెక్కడా కనబడటం లేదట. పార్టీ కార్యక్రమాల్లో మాజీ ఎంపి కనబడటం లేదంటే సరేలే అని సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ చంద్రబాబునాయుడు దగ్గర కూడా కనబడటం లేదట. జిల్లాలోని మాజీ మంత్రులు, సీనియర్ నేతలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు …
Read More »టీడీపీలో ముగ్గురు మహిళల పంతం.. హామీ ఇస్తేనే.. అడుగు బయటకు!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అసంతృప్తులు, అసమ్మతులు, నిరసన గళాలు ఎక్కడా సర్దుమణగడం లేదు. పదువుల పందేరాలు జరిగినా.. జంబో కమిటీలను ఏర్పాటు చేసి.. నాయకులకు, నాయకురాళ్లకు బాధ్యతలు అప్పగించినా.. ఇంకా ఏదో కావాలనే ఆరాటం మాత్రం వారిలో ఎక్కడా తగ్గక పోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ జాబితాలో ముగ్గురు కీలక మహిళా నాయకురాళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు పార్టీలో చర్చకు వచ్చింది. వీరిలో గుమ్మడి సంధ్యారాణి, తోట …
Read More »‘బ్యాంకు ఫ్రాడు’చౌదరిను ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు
కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి ఢిల్లీ ఎయిర్ పోర్టులో అవమానం జరిగింది. అమెరికాకు వెళ్ళేందుకు విమానాశ్రయానికి వచ్చిన సుజనాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అనేక బ్యాంకు ఫ్రాడు కేసుల విచారణను ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రిపై లుకవుట్ నోటీసు ఉన్న కారణంగా దేశం విడిచి వెళ్ళే అవకాశాలు లేవని అడ్డుకున్నారు. దాంతో అత్యతవసరంగా లంచ్ మోషన్ పద్దతిలో కోర్టులో పిటీషన్ వేసిన సుజనా చివరకు అమెరికాకు వెళ్ళటానికి రెండు వారాల అనుమతిని …
Read More »పండగ మూడ్ లో ఉండగా పాక్ భారీ దొంగదెబ్బ
దేశమంతా దీపావళి ఉత్సవాలు జరుపుకుంటుంటే దాయాది దేశం పాకిస్ధాన్ భారత్ ను సరిహద్దుల్లో దొంగదెబ్బ తీసింది. అయతే పాకిస్దాన్ దొంగదెబ్బను పసిగట్టిన మన సైన్యం వెంటనే తేరుకుని చావుదెబ్బ కొట్టింది. మన సైన్యం అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.45-2.45 మధ్య భారత్-పాకిస్ధాన్ సరిహద్దుల్లోని దేవార్, కేరన్, ఊరి, నౌగమ్ ప్రాంతాల్లో పాకిస్ధాన్ హఠాత్తుగా దొంగదెబ్బ మొదలుపెట్టింది. సరిహద్దుల్లో కాపలాగ ఉన్న మన సైన్యంపై ఒక్కసారిగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates