యూపీ ఎన్నికల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ..!

తెలంగాణ బిడ్డ.. ఉత్తరప్రదేశ్ లో సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలానికి చెందిన శ్రీకళా రెడ్డి అనే మహిళ.. ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు.

మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె ఈ శ్రీకళా రెడ్డి కావడం గమనార్హం. ఈమె గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న అనుభవం ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ.. బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరు వినిపించడం గమనార్హం.

కాగా.. కొంత కాలం క్రితం ఆమెకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ధనుంజయ్ తో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో.. ఆమె అక్కడ జరిగితన పరిషత్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ పోటీల్లో ఆమె జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. ఆ తర్వత జౌన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గానూ ఎన్నికయ్యారు. కాగా.. ఈ వార్త ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటోంది. మా ఇంటి బిడ్డ.. పక్క రాష్ట్రంలో సత్తా చాటిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.