వైసీపీ అధినేత జగన్ వర్సెస్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ దుమారం ఓ రేంజ్‌లో సాగుతు న్న విషయం తెలిసిందే. ఇది ఇటీవల ఎన్నికల్లో జగన్ ఓటమి వరకు దారి తీసింది. తీవ్రస్థాయిలో షర్మిల జగన్‌పై యాంటీ ప్రచారం చేశారు. ఇక, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. రాష్ట్రంలో ఏం జరిగినా దాని ని జగన్ పాలనకు అంటగట్టి విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ విమర్శలకు, టార్గెట్‌కు కారణం.. వారసత్వపు ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాలే కారణమన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ.
ఈ విషయంలో జగన్, షర్మిలల మాతృమూర్తి కూడా.. ఏమీ చేయలేక పోయారన్న వాదన ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ను తమకు ఇచ్చేయాలన్నది షర్మిల డిమాండ్ చేస్తున్నారని ఏడాది కాలంగా చర్చనడుస్తోంది. ఈ విషయంలో జగన్ పంతానికి పోయారని.. దానిని ఇచ్చేది లేదని తేల్చి చెప్పారని కూడా కొన్నాళ్లు విశ్లేషణలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు లోటస్‌పాండ్ షర్మిల వశం అయినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
షర్మిల తనపై దూకుడు తగ్గిస్తేనే తప్ప.. రాజకీయంగా తాను పుంజుకునే పరిస్థితి లేదనిజగన్ భావించార ని వైసీపీకి చెందిన అత్యంత విశ్వసనీయ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులతో పోరాటం చేయొచ్చు కానీ.. సొంత వారే పగవారై.. సూటి పోటి మాటలతో విమర్శలు గుప్పిస్తే.. ఎలా అన్నది జగన్ మాటగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ రాజకీయ నేత, వైఎస్ కుటుంబంతో అతి దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి ద్వారా.. మంత్రాంగం జరిగినట్టు తెలుస్తోంది.
దీంతో లోటస్ పాండ్‌ను జగన్ వదులుకున్నారన్నది తాజాగా తెలిసిన విషయం. ఈ పరిణామాలతోనే షర్మిల.. తగ్గుతున్నారని.. అన్నను టార్గెట్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. దీనిలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. మూడు రోజుల కిందట కూడా.. జగన్‌ను షర్మిల దుయ్యబట్టారు. ప్రాజెక్టులను సరిగా నిర్వహించనందుకే.. బుడమేరు పొంగి.. ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయని ఆమె వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates