మోడీకి పోటీ ‘విక‌సిత ఏపీ-2047’ చంద్ర‌బాబు ల‌క్ష్యాలు ఇవే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని సాగుతున్న నీతి ఆయోగ్ భేటీలో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏపీ అభివృద్దిని ఆవిష్క‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వం ‘విక‌సిత్ భార‌త్ – 2047’ అంటూ.. ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. దీనికి పోటీగా చంద్ర‌బాబు విక‌సిత్ ఏపీ-2047ను చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. వ‌చ్చే 2047నాటికి ఏపీని ఎలా డెవ‌ల‌ప్ చేస్తామ‌నే విష‌యాన్ని ఆయ‌న విశ‌దీక‌రించారు. మొత్తంగా 22 నిమిషాల పాటు నీతి ఆయోగ్ భేటీలో మాట్లాడిన చంద్ర‌బాబు అనేక‌ విష‌యాలు వెల్ల‌డించారు.

గ‌తంలో ‘విజ‌న్‌-2020’ ఆవిష్క‌ర‌ణ నుంచి ప్ర‌స్తుత విక‌సిత ఏపీ-2047 వ‌ర‌కు చంద్ర‌బాబు ప‌లు అంశాల‌ను వివ‌రించారు. ఈ స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా ఆయ‌న ఉటంకించ‌డం విశేషం. అమ‌రావ తి నిర్మాణం జ‌రిగితే.. ఒక్క ఏపీ మాత్ర‌మే లాభ‌ప‌డుతుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. కానీ, న‌వ న‌గ‌రాలను నిర్మించ‌డం ద్వారా ప్ర‌పంచ స్థాయి సంస్థ‌లు అమ‌రావ‌తికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. త‌ద్వారా.. దేశానికి ఆదాయం పెరుగుతుంది.

అదేవిధంగా దేశంలోని ఎక్క‌డివారైనా అమ‌రావతిలో ఉపాధి, ఉద్యోగాలు పొందేందుకు.. ఛాన్స్ ఉంటుంది. ఇది దేశ జీడీపీని పెంచుతుంది అని చంద్ర‌బాబు వివ‌రించారు. అదేవిధంగా అమ‌రావ‌తి నిర్మాణం.. దేశ ప్ర‌గ‌తికి దోహ‌ద‌కారిగా మారుతుందని చంద్ర‌బాబు చెప్పారు. న్యాయ రాజధానిలో ప్ర‌పంచ స్థాయి ఎగ్జిబిష‌న్‌ను నెల‌కొల్ప‌నున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా ఐటీ, ఏఐ వంటి కీల‌క రంగాల‌కు అమరావ‌తిలో పెద్ద‌పీట వేయ‌నున్న‌ట్టు చెప్పారు.

ఇక‌, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా నీతి ఆయోగ్‌లో చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. “పోల‌వ‌రం ప్రాజెక్టు కేవ‌లం ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం కాదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల‌కు కూడా.. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటిని అందించే బృహ‌త్త‌ర అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా 8 ల‌క్ష‌ల ఎగ‌రాల సాగుభూమి అందుబాటులోకి వుంటుంది.” అని చంద్ర‌బాబు వివ‌రించారు.

అలాగే.. న‌దుల అనుసంధానాన్ని త‌న క‌ల‌గా చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో గోదావ‌రి, కృష్ణా న‌దుల అనుసంధానంలో కొంత ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని.. ఇది దేశ‌వ్యాప్తంగా జ‌రిగితే.. ఏటా కొన్ని కోట్ల క్యూసెక్కుల నీటిని స‌ముద్రంలో క‌ల‌వ‌కుండా.. ఆదా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రించారు.