వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు జగన్‌కు మైండ్ పనిచేయట్లేదని.. అందుకే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యల్లో టీడీపీ వారే ఎక్కువగా చనిపోయిన విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు. ఇప్పటి వరకు నాలుగు హత్యలు జరిగిన మాట వాస్తవమేనని .. అయితే.. మూడు ఘటనల్లో ముగ్గరు టీడీపీ నాయకులు మృతి చెందారని తెలిపారు.
వినుకొండలో జరిగిన ఘటనలో వైసీపీ వాళ్లే వైసీపీ వాళ్లను చంపుకొన్నారని స్థానికంగా చర్చ సాగుతోందన్నారు. ఈ విషయాలను దాచేసి రాష్ట్రంలో 36 హత్యలు జరిగినట్టు జగన్ విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒకవేళ అవి నిజమే అయితే.. 36 హత్యల వివరాలను తమకు ఇవ్వాలని.. చర్యలు తీసుకుంటామని అనిత డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన నేపథ్యంలో జగన్‌కు మైండ్ పనిచేయట్లేదని అనిత వ్యాఖ్యానించారు. అందుకే నోటికి ఏది వస్తే అది చెబుతున్నారని దుయ్యబట్టారు.
అధికారం ఎందుకు కోల్పోయిందో జగన్ ఆలోచన చేసుకోవాలని మంత్రి అనిత సూచించారు. కానీ.. దానిని వదిలేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రజలు ఎప్పటికీ జగన్‌ను నమ్మబోరని అనిత చెప్పారు. వాస్తవానికి విరుద్ధంగా రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయని చెబుతున్న జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు వచ్చిన ఇబ్బంది లేదని.. అధికారం పోవడంతో .. జగన్‌కే శాంతి లేకుండా పోయిందని.. అందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తు న్నారని అనిత వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. ఎంపీ లావు శ్రీకృష్ట దేవరాయులు కూడా.. జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్యలు పెరిగిపోయాయని చెబుతున్న జగన్.. అంకెతలతో కాదు.. పక్కా లెక్కలతో రావాలని ఎంపీ సవాల్ రువ్వారు. అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. 36 మంది హత్యకు గురయ్యారన్న జగన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అదే నిజమైతే.. ఆయా వివరాలు.. వారి పేర్లు, అడ్రస్‌లను వెల్లడించాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates