పవన్ బాబాయికి ఒక్కసారి ఓటేయండి. ఒక్కసారి ఆయనను అసెంబ్లీకి పంపించండి .. ప్లీజ్ అంటూ.. మెగా ప్రిన్స్ నాగబాబు కుమారుడు కొణిదెల వరుణ్ తేజ .. పిఠాపురంలో తన ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈయన వచ్చే ఎన్నికల వరకు కూడా పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి టీ-టైమ్ శ్రీనివాస్‌ను కూడా గెలిపించాలని కోరుతున్నారు. వరుణ్ తేజ్ ప్రచారానికి యువత పెద్ద ఎత్తున తరలివచ్చి.. విజయవంతం చేశారు. ఆయన రోడ్ షోకి కూడా.. అనూహ్య స్పందనే లభించింది.
అయితే.. ఇప్పుడు ఈ ప్రచారం మరిన్ని మలుపులు తిరగనుంది. ఎన్నికలకు వారం ముందు.. మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆయన కూడా.. ప్రచారానికి రానున్నట్టు పిఠాపురంలో ప్రచారం జరుగుతోంది. వరుసగా రెండు రోజుల పాటు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం చేయనున్నారు. బాబాయి పవన్ తరఫున ఆయన కూడా.. బరిలోకిదిగి ప్రజలను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తారని పార్టీ కీలకనేతలు చెబుతున్నారు. షెడ్యూల్ ఖరారు కానుందని అంటున్నారు.
పిఠాపురం ప్రచారంలోకి రామ్ చరణ్ కూడా వస్తే.. ఇక, ప్రచారంలో మరింత కాక పెరుగుతుందనే అంచ నా వుంది. ఇప్పటికే.. నాగబాబు సహా.. జబర్దస్త్ కమెడియన్లు కూడా.. పవన్‌కు ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో మెగా కుటుంబం పెద్దగా బయటకు రాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం పవన్ మరింత సీరియస్‌గా తీసుకోవడం.. అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్న దరిమిలా.. అన్ని వైపుల నుంచి కూడా ఆయనకు సహకారం లభిస్తుండడం గమనార్హం.
దీనిలో కీలకమైన మెగా కుటుంబం మొత్తం ఆయన వెంటే ఉండడం.. ఆయన వెంటే నడవడం వంటివి ఆసక్తిగా మారాయి. మరోవైపు.. మెగా అబిమానులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్నా, గుంటూరు జిల్లాల్లోని మెగా అభిమాన సంఘాలతో తాజాగా నాగబాబు చర్చలు జరిపారు. వీరంతా కూడా సోమవారం లేదా బుధవారం నుంచి ప్రచారానికి రానున్నట్టు సమాచారం. మరి ఈ ప్రచారాలు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates