ప‌వ‌న్‌కు ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంచ‌ల‌న లేఖ సంధించారు. బుధ‌వారం జ‌రిగిన జెండా స‌భ‌లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఈ లేఖ సంధించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ముద్రగడ పద్మనాభం జ‌న‌సేన‌లో చేరుతార‌ని అనుకున్నారు. కానీ, కార‌ణాలు తెలియ‌క పోయినా.. ఆయ‌న దూరంగానే ఉన్నారు. మ‌రోవైపు తాడేపల్లి గూడెం సభలో పవన్ మాట్లాడుతూ.. తనతో వచ్చే వాళ్లంతా పోరాడే వాళ్లు అయి ఉండాలే కానీ సలహాలు ఇచ్చే వాళ్లు వద్దే వద్దని తెగేసి చెప్పేశారు.

ఈ నేప‌థ్యంలో ముద్ర‌గడ లేఖ ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ లేఖ‌లో ప్ర‌ధాన విష‌యాలు చూస్తే.. ముద్ర‌గ‌డ బాగా నొచ్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇవీ ప్ర‌ధాన విష‌యాలు..

  • 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానన్నారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పాను. మన ఇద్దరి కలయికను యావత్ కాపు జాతి చాలా బలంగా కోరుకున్నారు. వారి అందరి కోరికతో నా గతం, నా బాధలు, అవమానాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాను.
  • కానీ, దురదృష్టవశాత్తు మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు.
  • చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్‌ బయటకు రావడానికి భయపడిపోయింది. అంతా ఇళ్ళకే పరిమితమైపోయారు. అలాంటి సమయంలో తమరు జైలుకి వెళ్లి వారికి భరోసా ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు.
  • టీడీపీ పరపతి పెరగడానికి ఎదరు ఎన్ని చెప్పినా మీరే కారణమని బల్లగుద్ది చెప్పగలను. ప్రజలంతా ముమ్మల్ని ఉన్నత స్థానంలో స్థానంలో చూడాలని తహతహలాడారు.
  • పవర్‌ షేరింగ్‌కు ప్రయత్నించి 80 సీట్లు అడుగి, ముందుగా మిమ్మల్ని రెండేళ్లు సీఎంగా చేయమని కోరి ఉండాలి.
  • కానీ ఆ సావాసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయులేదు.
  • కానీ మీలా గ్లామర్ ఉన్న వ్యక్తి కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్‌ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటివాడిగా ఉండటంతోనే వస్తానని చెప్పించి రాలేకపోయారు.
  • మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.