మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగనున్న ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఎలా ఉంది? జనం నాడి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? ఏ పార్టీ విషయంలో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? వెరసి మొత్తంగా ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఇవే విషయాలపై తాజాగా ప్రముఖ సర్వే సంస్థ చాణక్య స్ట్రాటజీస్ సర్వే
రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. దీని ప్రకారం.. అధికార వైసీపీ. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన సహా ఇతర పార్టీల పరిస్థితిని అంచనా వేసింది. ఈ సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది.
‘చాణక్య స్ట్రాటజీస్ సర్వే’ ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో(2019-23) టీడీపీ గ్రాఫ్ పుంజుకుందని తెలుస్తోంది. అదేసమయంలో అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ పడిపోయినట్టు అర్థమవుతోంది. ఇక, జనసేన సహా ఇతర పార్టీల గ్రాఫ్ కూడా కొంత మేరకు పెరిగినట్టు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం ఉన్న గ్రాఫ్‌లు.. ఎన్నికల సమయానికి మరింత పెరగడమో.. తగ్గడమో జరుగుతుందని సర్వే సంస్థ వెల్లడించింది. ఇవీ వివరాలు..
టీడీపీ: 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీ గ్రాఫ్ 39 శాతం ఉండగా.. ప్రస్తుతం 43 శాతానికి పెరిగింది.
వైసీపీ: 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీ గ్రాఫ్ 50 శాతం ఉండగా ప్రస్తుతం 41 శాతానికి(ఏకంగా 9శాతం) పడిపోయింది.
జనసేన: 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీ గ్రాఫ్ 6 శాతం ఉండగా ప్రస్తుతం 10 శాతానికి(ఏకంగా 4శాతం) పెరిగింది.
ఇతర పార్టీలు: 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీల గ్రాఫ్ 5 శాతం ఉండగా ప్రస్తుతం 6 శాతానికి చేరింది.