కేటీఆర్ భేటీ.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా?

తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే.. ఓట‌మి బాధ నుంచి తేరుకుంటోంది. గెలిచిన నాయ‌కుల‌ను పార్టీ కార్యాల‌యానికి పిలిపించుకుని భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిస్తోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

తాజాగా బేటీకి అంద‌రూ రావాల‌ని.. పార్టీ నుంచి ఆహ్వానం అందింది. అయితే.. గెలిచిన వారిలో తెల్లంను త‌ప్పిస్తే.. మిగిలిన వారిలో మ‌రో ముగ్గ‌రు డుమ్మా కొట్టారు. మామా అల్లుళ్లు.. మ‌ల్లారెడ్డి(మేడ్చ‌ల్‌), రాజ‌శేఖ ర్‌రెడ్డి(మ‌ల్కాజిగిరి), సుదీర్‌రెడ్డి(ఎల్బీన‌గ‌ర్‌)లు స‌మావేశానికి హాజ‌రు కాలేదు. కీల‌క‌మైన ఈ స‌మావేశానికి వారు గైర్హాజ‌రు కావ‌డంతో పార్టీలో లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి.

ఎవ‌రు అధికారంలో ఉంటే వారికి జైకొట్టే ల‌క్షణం ఉన్న మ‌ల్లారెడ్డి గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇదిలావుంటే. తాజా భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, భవిష్యత్ ప్రణాళికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చ‌ర్చిస్తున్నారు. అయితే.. కీలక మైన మీటింగ్ కు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేల రాకపోవడంతో వీరు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మ‌రోవైపు.. నేడు రేపు కూడా ఈ సెగ ఉంటుంద‌ని బీఆర్ ఎస్ సైతం అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.