తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలిసిందే. పైకి పెద్దగా మాట్లాడుకున్నట్టు కనిపించకపోయినా.. రాకపోకలు లేకపోయినా.. ఇరువురి మధ్య స్థానిక రాజకీయాల్లో మాత్రం ఒక అవగాహన అయితే ఉందనే చర్చ తరచుగా జరుగుతూనే ఉంది. నిజానికి కేంద్రంలోని బీజేపీసర్కారు విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరి.. కేసీఆర్ కు మండేలా చేస్తోంది.
అయితే. తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం సహా.. పారిశ్రామిక వేత్తలంతా.. సీఎం జగన్‌కు అనుకూలంగా ఉండడంతోపాటు.. ఆయన చెప్పినట్టు వ్యవహరించే వారు కావడంతో కేసీఆర్‌కు ఎన్నికల సమయంలో జగన్ అవసరం ఎంతో ఉంటుందనేది విశ్లేషకుల మాట. ఇక, ఇటు వైపు నుంచి చూసుకుంటే.. ఏపీలో జగన్ గెలిచేందుకు గత ఎన్నికల్లో కేసీఆర్ తెరచాటున ప్రచారం చేశారనేది తెలిసిందే. తన వారిని ఇక్కడకు పంపించి ఆయన వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
ఫలితంగా కేసీఆర్.. జగన్‌కు సహకరించినట్టు అయింది.ఇక, వచ్చే ఎన్నికల్లోనూ ఇటు వారు అటు, అటు వారు ఇటు సహకరించుకోవడం ఖాయమనేచర్చ జరుగుతూనే ఉంది. అయితే.. వీరి మధ్య అన్యోన్యత.. సహకారం ఉంటే.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ గెలుస్తుందనే అంచనాలు వస్తున్న దరిమిలా.. జనసేన అధినేత పవన్ అలెర్ట్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు.
అవసరమైతే.. కేసీఆర్‌కు తాను సాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగు తోంది. తాను పోటీ చేయడమా? చేయకపోవడమా? అనే విషయం నుంచి జనసేన ప్రచారం మాటున.. తెలంగాణలో ప్రతిపక్షాలను డైల్యూట్ చేసి.. కేసీఆర్‌కు మేలు చేయాలనే వ్యూహంతో ఆయన ఉన్నారనేది ఓవర్గం నాయకులు.. చెబుతున్నమాట. ఇక, కేసీఆర్ కూడా.. తనకు వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యంగా అడుగులు వేస్తున్నారు.. తప్ప.. ఎవరు ఏంటనేది మాత్రం ఆయన పట్టించుకోవడం లేదని అంటున్నారు.