ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పాల్.. రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ లు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని కేఏ పాల్ పేర్కొన్నారు. బీజేపీతో జనసేన పార్టీ ఎందుకు పొత్తు చేసుకుందంటే.. ఇన్ కమ్ టాక్స్ ఎగ్గొట్టడానికి కే అని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్, చిరంజీవిలను ప్రజలు నమ్మకండని అన్నారు. పవన్ కళ్యాణ్ ది ‘వారాహి యాత్ర’ కాదని.. ‘మోడీ యాత్ర’ అని పేర్కొన్నారు. చిరంజీవి కూడా జనసేనలో చేరుతానని లీక్స్ ఇస్తున్నాడు అని కేఏ పాల్ తెలిపారు. సిగ్గు ఉన్న వారు ఏవరైన జనసేనలో చేరతారా అంటూ పాల్ ప్రశ్నించారు. బీజేపీ కోసమే పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. దీనిపై చిరంజీవి, పవన్, నాగేంద్రబాబుతో ఓపెన్ డిబేట్ కు నేను సిద్ధంగా ఉన్నాను అని కేఏ పాల్ సవాల్ విసిరారు.
మోడీ, చంద్రబాబు, కేసీఆర్ లకు గుండు గీస్తానని ఘాటు వ్యాక్యలు చేశారు పాల్. బీజేపీ బీ పార్టీలను ఓడిస్తానని చెప్పారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్, జెడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్, జయ ప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కేవలం యాంకర్లుగా మిగిలిపోవద్దు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. 2024 తరువాత జనసేన పార్టీ.. బీజేపీలో విలీనం కావడం ఖాయమని అన్నారు కేఏ పాల్.
Gulte Telugu Telugu Political and Movie News Updates