ఇతర నేతల పరిస్థితి ఎలా ఉన్నా..జనసేన అధినేతగా పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని చిన్నా పెద్దా కోరుకుంటున్నారు. దీనిపై కొన్ని యూట్యూబ్ చానెళ్లు చేసిన సర్వేల్లోనూ పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా సందేహంగానే ఉంది. దీనిపై ఇంకా అంతర్గత సర్వేలు చేస్తూనే ఉన్నారు. ఈ సారి తణుకు నుంచి పోటీ చేస్తారని.. తాజాగా కొందరు చెప్పుకొచ్చారు. మరికొందరు.. తిరుపతి అంటున్నారు.
సరే.. ఇది ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం పాజిటివ్‌గా ఆలోచిస్తుండడం ఒక్కటే పవన్‌కు కొంత ఊరట కలిగించే విషయం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. పవన్ మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమనే సంకేతాలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి కారణాలు వేరే ఉన్నా.. ఆయనను మాత్రం ప్రజలు కోరుకుంటున్నారనేది వాస్తవం. ప్రస్తుతం పవన్ విషయంలో జనం మధ్య జరుగుతున్న జనసేన ఎలా ఉన్నా… పవన్ గురించి జనం టాక్ ఇదే..!
జనసేన పార్టీ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎలా ఉందో అందరికీ తెలిసిందే. నాయకుల్లోనూ టికెట్లపై తర్జన భర్జన కొనసాగుతోంది. పార్టీని అంటిపెట్టుకుని.. ఇన్నాళ్లు తిరిగిన వారు కూడా.. టికెట్లు వస్తాయో లేవో అనే సందేహంతో ఉన్నారు. అయితే.. వీరి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పార్టీ అధినేత పవన్ గ్రాఫ్ ఎలా ఉందనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఓవర్ హెడ్ ట్యాకును బట్టే.. క్షేత్రస్థాయిలో కుళాయిలు..బాగుండేది.
ఇలానే పవన్ గురించిన చర్చ సర్వత్రా సాగుతోంది. ఒకవైపు పవన్ ఇమేజ్‌ను డ్యామేజీ చేసే యంత్రాం గం ఉండనే ఉంది. మరోవైపు.. పవన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పవన్ పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. స్వల్ప మెజారిటీనా.. భారీ మెజారిటీనా అనేది పక్కనపెడితే.. ఓటమి ఓటమే! ఇక, ఇప్పుడు ఆయనచర్చల్లో మెజారిటీ ప్రజలు ఆయనను అసెంబ్లీకి పంపించేందుకు రెడీగా ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates