కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ నేతలు సంబరాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సంబరాల్లో మునిగిపోయింది. అయితే.. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మోడీ పాలనపై 9 ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? అంటూ.. సవాల్ విసిరింది.
ఇవీ ప్రశ్నలు..
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం భారతదేశంలో ఉవ్వెత్తున ఎగసిపడటానికి కారణం ఏమిటి?
ధనవంతులు మరింత ధనవంతులు, పేదలు మరింత పేదలుగా ఎందుకు మారుతున్నారు?
ప్రజా ఆస్తులను మోడీ మిత్రులకు ఎందుకు అమ్మేస్తున్నారు?
పేదలు, ధనికుల మధ్య అసమానతలు ఎందుకు పెరిగాయి?.
నల్లచట్టాలుగా ముద్రపడిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ వారితో రైతులతో చేసుకున్న అగ్రిమెంట్లను ఇంతవరకూ ఎందుకు అమలు చేయలేదు? కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేకపోయారు. తొమ్మిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు ఎందుకు కాలేదు?
బీజేపీ పాలిత ప్రాంతాల్లో విచ్చలవిడి అవినీతిపై ఎందుకు మౌనంగా ఉన్నారు. భారతీయల కడగండ్లను ఎందుకు పట్టించుకోవడం లేదు?
ఎన్నికల్లో లబ్ది కోసం విద్వేష రాజకీయాలకు ఎందుకు పాల్పడుతున్నారు. సమాజంలో భయాలు పెరుగుతున్న వాతావరణం ఎందుకు కల్పిస్తున్నారు?
మహిళలు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? కుల గణన డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రతిపక్ష పార్టీలు, నేతలపై ప్రతీకార రాజకీయాలకు ఎందుకు పాల్పడుతున్నారు?
Gulte Telugu Telugu Political and Movie News Updates