పొత్తులు లేకుంటే అంతే.. బీజేపీ నేత‌ల గుస‌గుస‌…!

వ‌చ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకుంటే.. అన్నో ఇన్నో అసెంబ్లీ.. ఒక‌టో రెండో పార్ల‌మెంటు స్థానాల్లోనూ విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని బీజేపీ నాయ‌కులు త‌ల‌పోస్తున్నారు. ఈ విష‌యంలో ప్ర‌స్తుతం క‌మ‌ల నాథుల‌తో క‌లిసి న‌డుస్తున్న జ‌న‌సేన కూడా అదే అభిప్రాయంతో ఉంది. మీరు బ‌త‌కండి.. మ‌మ్మ‌ల్ని బ‌తికించండి.. అంద‌రం క‌లిసి అధికారంలోకి వ‌ద్దాం.. అని చెబుతోంది.

అయితే.. ఈ విష‌యంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. కేంద్రంలోని పెద్ద‌లు అనుస‌రించే వ్యూహాల మేర‌కు.. వారు అడుగులు వేయాల‌ని చూస్తున్నారు. ప్ర‌స్తుతం లోపాయికా రీగా వైసీపీతో క‌లిసి ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీనివ‌ల్ల ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన న‌ష్టం లేక‌పోయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.. న‌ష్ట‌పోయేది బీజేపీనేన‌ని అంటున్నారు క‌మ‌ల నాథులు.

“మాలో మాకే క్లారిటీ లేదు. వైసీపీని న‌మ్ముకుంటే.. లోపాయికారీగా అయినా.. ఆ పార్టీతో అడుగులు వేస్తే.. న‌ష్ట‌పోవ‌డం ఖాయం. వైసీపీ మాత్రం మాకు ప్ర‌త్య‌క్షంగా ఎలాంటి మ‌ద్ద‌తు ఇవ్వ‌దు. ఈ విష‌యంలో మావాళ్ల‌కు కూడా క్లారిటీ ఉంది. కానీ, ఆ పార్టీని ప‌ట్టుకుని ఎందుకు వేలాడుతున్నారో అర్ధం కావ‌డం లేదు. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా..వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా.. వ్యూహాలు మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది“ అని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క బీజేపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు.

ఇటీవ‌ల ఆయ‌న ఓ కీల‌క ఎన్నిక‌లో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అదే.. టీడీపీతో అంతో ఇంతో చ‌నువుగా ఉండి ఉంటే.. తాను గెలుపు గుర్రం ఎక్కేవాడిన‌ని అన్నారు. ఇదే అభిప్రాయంతో సీమ బీజేపీ నాయ‌కులు కూడా ఉన్నారు. ముఖ్యంగా క‌డ‌ప, అనంత‌పురంలో పావులు క‌దుపుతున్న బీజేపీ నాయ‌కు లు.. పొత్తులు లేకుంటే.. న‌ష్ట‌పోతామ‌ని కూడా చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి వేళ్లూ సోము వీర్రాజువైపే ఉన్నాయి. ఆయ‌న చొర‌వ తీసుకుని.. పార్టీ కోసం ప‌నిచేయాల‌నే వారు పెరుగుతున్నారు.