సొంత ఎమ్మెల్యేలే షాక్‌.. తీవ్ర సంక‌టంలో వైసీపీ!

ఔను.. ఈ ప‌రిస్థితిని వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ అస్స‌లు ఊహించి ఉండ‌రు. ఎందుకంటే.. ఇటీవ‌లే ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ తూర్పు, ప‌శ్చిమ ప్రాంతాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. అయితే.. దీనిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే.. ఇది అస‌లు ఎన్నికే కాద‌ని… త‌మ నుంచి ప‌థ‌కాలు అందుకుంటున్న ప్ర‌జ‌లు త‌మ‌కు అనుకూలంగానే ఉన్నార‌ని.. వైసీపీ నేత‌లు భాష్యం చెప్పారు.

దీంతో స‌రేలే.. వైసీపీ చెప్పిన దానిలోనూ ఏదో కొంత లాజిక్ ఉందిక‌దా.. అని రాజ‌కీయ విశ్లేష‌కులు స‌రిపు చ్చుకున్నారు. అయితే.. వారం తిరిగే స‌రికి.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మేల్యేలే ఓటువేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అస‌లు.. ఏమాత్రం తేడా జ‌ర‌గ‌కూడ‌ద‌ని.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ భావించారు. క‌ట్టుదిట్ట‌మైన నిఘా పెట్టారు. అయితే.. అవ‌న్నీ కూడా ప‌టాపంచ‌లు అయ్యాయి. ఎవ‌రైతే..తాను గీసిన గీత దాట‌ర‌ని భావించారో. వారే ఇప్పుడు జ‌గ‌న్ ఝ‌ల‌క్ ఇచ్చారు.

తాజా ఎన్నిక‌ల్లో ఏకంగా.. న‌లుగురు ఎమ్మెల్యేలు క‌ట్టు త‌ప్పారు. ఎందుకంటే.. టీడీపీకి నైతికంగా ఉన్న బ‌లం 19 మంది ఎమ్మెల్యేలే. టెక్నిక‌ల్‌గా 23 మంది అభ్య‌ర్థుల బ‌లం ఉన్నా.. న‌లుగురు ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీపంచ‌న చేరిపోయారు. అయితే.. ఇప్పుడు ఆ న‌లుగురు వైసీపీ నుంచి టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్యే ఎన్నిక‌ల‌ను లైట్ తీసుకున్న వైసీపీ అధినేత‌కు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే గ‌ట్టి.. షాక్ ఇచ్చార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.