టీడీపీ.. ఘ‌ర్ వాప‌సీ మంత్రం!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ.. ఘ‌ర్ వాప‌సీ మంత్రాన్ని ప‌ఠిస్తోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీ నుంచి దూర‌మైన వారిని చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. స‌మాజంలో మంచి ప‌లుకు బ‌డి.. ఆర్థికంగా బలం ఉన్న‌వారిని త‌మ వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో క‌డ‌ప జిల్లా కు చెందిన ఆదినారాయ‌ణరెడ్డి, సీఎం రమేష్‌, స‌హా.. అనేక మంది నాయ‌కుల‌ను తిరిగి రావాల‌ని కోరుతు న్న‌ట్టు తెలుస్తోంది.

అలానే.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి కూడా చాలా మంది నాయ‌కులు వైసీపీ చెంత‌కు చేరిపోయారు. వీరిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని టీడీపీ నాయ‌కులుచెబుతున్నారు. వ‌చ్చే ఎన్ని క‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నేప‌థ్యంలో టీడీపీ.. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. అన్ని వ‌ర్గాల‌ను కూడా క‌లుపుకొని పోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అదేవిధంగా గ‌తంలో పార్టీకి సేవ‌లు అందించి.. దూర‌మైన వారిని కూడా ద‌రి చేర్చుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

ఇక‌, ఇప్పుడు టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి.. వేరే పార్టీల్లో ఉన్న‌వారు కూడా అంత‌ర్మ‌థనంలో ప‌డ్డారు. త మకు టికెట్లు ద‌క్కుతాయో లేదో.. అనే బెంగ ఒక‌వైపు వారిని వేధిస్తోంది. తీరా చివ‌రి నిముషం వ‌ర‌కు ఉంటే.. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని కూడా వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. కొంద‌రికి మొహం మాటం అడ్డొచ్చి ఆగుతున్న‌వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే చంద్ర‌బాబు ఇప్పుడు ఘ‌ర్ వాప‌సీ మంత్రాన్ని వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.