చంద్ర‌బాబుకు ఘోర అవ‌మానం.. జ‌గ‌న్ అలా చేశారా?

టీడీపీ అధినేత.. ఏపీ ప్ర‌ధాన ప్రతిప‌క్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబునాయుడుకు అవ‌మానం జ‌రిగిందా? అది కూడా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కావాల‌నే చేశారా? అంటే.. టీడీపీ నాయ‌కులు ఔన‌నే అంటు న్నారు. ఈ అవ‌మానాన్ని భ‌రించ‌లేక‌.. చంద్ర‌బాబు బాధ‌ప‌డ్డార‌ని.. వెంట‌నే తిరుగు ప్ర‌యాణం కూడా అయ్యార‌ని.. చెబుతున్నారు. మ‌రి ఇంత‌కీ చంద్ర‌బాబును అంత‌గా వేధించిన ఘ‌ట‌న ఏంటంటే..

తాజాగా ఏపీలో కొత్త గ‌వ‌ర్న‌ర్ కొలువుదీరారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌య్య‌ద్ అబ్దుల్ న‌జీర్.. ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా.. కొత్త గ‌వ‌ర్న‌ర్‌తో ప్ర‌మాణం చేయించారు. రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తోపాటు.. మంత్రి వ‌ర్గాన్ని కూడా ఆహ్వానించారు. ఇక‌, ప్ర‌త్యేక అతిథులు కూడా హాజ‌ర‌య్యారు.

ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును కూడా ఆహ్వానించారు. కొత్త గ‌వ‌ర్న‌ర్‌.. పైగా సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి కావ‌డంతో చంద్ర‌బాబు స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ ర‌య్యారు. అయితే.. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబుకు అవ‌మానం జ‌రిగింద‌నేది టీడీపీ నేత‌ల‌మాట‌.

టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌లు ఇవే..

అవ‌మానం 1: ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ను మండ‌లి చైర్మ‌న్ ప‌క్క‌న కూర్చోబెట్టారు. (స‌హ‌జంగా ముఖ్య‌మంత్రి ప‌క్క‌న లేదా.. అదే వ‌రుస‌లో కూర్చోబెట్టాలి)

అవ‌మానం 2: గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం.. ముందుగా ముఖ్య‌మంత్రిబొకే అందించారు. త‌ర్వాత హైకోర్టు సీజే అందించారు. త‌ర్వాతప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు పుష్ప‌గుచ్ఛంఇవ్వాలి. కానీ, చంద్ర‌బాబును స్టేజ్ మీద‌కు ఆహ్వానించ‌లేదు.

అవ‌మానం 3: కొత్త గ‌వ‌ర్న‌ర్‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. రాష్ట్ర నేత‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. వీరిలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని కూడా ప‌రిచ‌యం చేయాలి. కానీ, జ‌గ‌న్‌.. త‌న‌ను, త‌న మంత్రి వ‌ర్గాన్ని ప‌రిచ‌యం చేసుకున్నారే త‌ప్ప‌..చంద్ర‌బాబును ప‌రిచ‌యం చేయ‌లేదు.

అవ‌మానం 4: దీంతో చంద్ర‌బాబు రాజ్‌భ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. అయితే.. ఇవ‌న్నీ ఓ కంటితో అధికార పార్టీ పెద్ద‌లు ప‌రిశీలించిన‌ప్ప‌టికీ.. బాబును ప‌ట్టించుకోలేదని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

అవ‌మానం 5: అధికార ఐ అండ్ పీఆర్ ఆన్‌లైన్‌లో ఉంచిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం వీడియోలో చంద్ర‌బాబును క‌నిపించకుండా.. స‌ద‌రు వీడియోను ఎడిట్ చేశార‌ని .. టీడీపీ నేత‌లు పేర్కొన్నారు.