ప‌ట్టాభి స‌హా 16 మందిపై హ‌త్యాయ‌త్నం కేసులు..

గ‌న్న‌వ‌రంలో కాలిపోయింది.. టీడీపీ వాహ‌నాలు. గ‌న్న‌వ‌రంలో దాడికి గురైంది టీడీపీ కార్యాల‌యం. గ‌న్న‌వ‌రంలో బూతులు తిట్టించుకుంది.. టీడీపీ నాయ‌కులు. గ‌న్న‌వ‌రంలో భౌతిక దాడికి గురైంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు. సో.. బాధితులు ఎవ‌రు? అంటే.. ప‌దో త‌ర‌గ‌తి పిల్లాడిని అడిగినా.. టీడీపీ నేన‌ని చెబుతాడు.

కానీ… ఏపీ పోలీసులు మాత్రం.. టీడీపీ నేత‌లేన‌ని అంటున్నారు. వారిపైనే కేసులుపెట్టారు. అవి కూడా హ‌త్యాయ‌త్నం కేసులు పెట్టారు. మ‌రికొంద‌రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. మ‌రి ఇలా ఎందుకు చేస్తున్నారు? అంటే.. ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’ అనే అంటున్నారు. గ‌న్న‌వ‌రం ఘ‌ట‌న‌కు సంబంధించి టీడీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరులు పేరిట కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికి పైగా తెలుగుదేశం శ్రేణులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

విజ‌య‌వాడ‌కు చెందిన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కొమ్మారెడ్డి పట్టాభి స‌హా మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటు మరో 11మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక‌, ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల‌ను గృహ నిర్బంధాల‌కు గురి చేశారు. ఎక్క‌డో హైద‌రాబాద్ నుంచి త‌న ఇంటికి వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ను దారిలో నే అరెస్టు చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఇక‌, ఫైర్ బ్రాండ్ బుద్దా వెంక‌న్న‌ను ఇంటి గ‌డ‌ప దాట‌నివ్వ‌లేదు. ఇదీ..సంగ‌తి!!