బీసీలు ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కాకలు తీరిన రాజకీయ యోధుడు కళా వెంకట్రావుకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం అందుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు తన పని చేసుకుపోతుండగా ఆయన్ను డిస్టర్బ్ చేయకుండా కొన్ని పనులను కళా వెంకట్రావుకు అప్పగించారు.
ఉత్తరాంధ్రలో టీడీపీ ఇప్పుడు సామాజికవర్గం లెక్కలు చూస్తోంది. కాపు వర్గాలను పూర్తిగా తమ వైపుకు తిప్పుకుంటే వైసీపీని నేలమట్టం చేయవచ్చన్న ఆలోచనలో టీడీపీ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వెంకట్రావుకు ఉన్న పరపతితో సొంత కాపు సామాజిక వర్గానికి గాలం వేయాలని చంద్రబాబు ఆదేశించారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ శ్రీకాకుళం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. ఈ సారి మొత్తం సీట్లు గెలిస్తే కళా వెంకట్రావు సేవలను గుర్తిస్తామని అధిష్టానం ఆఫరిచ్చినట్లు చెబుతున్నారు..
ఈ నెల 25న విశాఖలో టీడీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు అన్ని నియోజకవర్గాల ఇంఛార్జులు హాజరవుతారు. దాదాపు 4 వేల మంది వస్తారని, చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. ప్రాంతీయంగా పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల వారీగా జయాపజయాలపై కళావెంకట్రావు పార్టీ అధిష్టానానికి ఒక నివేదిక సమర్పిస్తారు. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు ఫోకస్ పెడుతోంది…
Gulte Telugu Telugu Political and Movie News Updates