ఏపీకి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. సుప్రీకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను ఏపీ నూతన గవర్నర్‌గా నియమిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ చేశారు.
ఇక, కొత్తగా నియమితులైన ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు. అయితే.. మధ్యలోనే తొలగించే లేదా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదా రాష్ట్రపతికి ఉంటుంది. ఇక, ఏపీకి నూతన గవర్నర్‌గా నియమితులైన అబ్దుల్ నజీర్.. రెండో వారు కావడం గమనార్హం. తొలి గవర్నర్‌గా.. ప్రస్తుతం ఉన్న విశ్వభూషణ్ హరిచందన్.. 2019 చివరిలో బాధ్యతలు చేపట్టారు.
ఇక, అబ్ధుల నజీర్ నేపథ్యం ఇదీ..
న్యాయవాదుల కుటుంబానికి చెందిన అబ్దుల్ నజీర్.. తన కెరీర్‌ను కూడా న్యాయవాద వృత్తిపైనే నడిపించారు. కర్ణాటకకు చెందిన ఆయన.. అక్కడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత.. ప్రెమోషన్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లారు. అనేక సంచలన తీర్పులు ఇచ్చారు. ముఖ్యంగా ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఒకరు. ట్రిపుల్ తలాక్ చెల్లదని తీర్పు ఇచ్చిన సుప్రీం ధర్మాసనంలోనూ జస్టిస్ నజీర్ ఉన్నారు.
జస్టిస్ అబ్దుల్ నజీర్ 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించిన ఆయన.. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates