సీబీఐకి అవినాష్ రెడ్డి ష‌ర‌తులు..

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐకి ఓ లేఖ రాశారు. దీనిలో కొన్ని ష‌ర‌తులు కూడా పెట్టారు. అది కూడా శ‌నివారం ఉద‌యం హ‌ఠాత్తుగా ఆయ‌న ఓలేఖ‌ను సీబీఐకి పంపించ‌డం ఆస‌క్తిగా మారింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆయ‌న సీబీఐ ఎదుట హాజ‌రు కావాల్సిన నేప‌థ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం కూడా ఏర్ప‌డింది.

ఇంత‌కీ అవినాష్‌రెడ్డి పెట్టిన ష‌ర‌తులు ఏంటంటే.. “వివేకా హత్య కేసులో నా ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కొందరు యత్నిస్తున్నారు. విచారణ పారదర్శకంగా జరగాలి. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలి. నాతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. లోప‌ల ఏం జ‌రుగుతోందో.. రికార్డు తీసుకునేందుకు, వాయిస్‌, వీడియో రికార్డ‌ర్‌ల‌కు అనుమ‌తి మంజూరు చేయాలి” అని అవినాష్‌ లేఖ రాశారు.

అదేస‌మ‌యంలో తాను శ‌నివారం విచారణకు హాజరవుతున్నానని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. తాను చేసిన‌ విజ్ఞప్తులను సీబీఐ పరిగణన‌లోకి తీసుకోవాల‌ని కోరారు. కాగా, ఆది నుంచి కూడా అన్ని వేళ్లు అవినాష్ వైపే చూపుతున్నాయి. అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ఉంచి వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత‌, వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కుమార్తె ష‌ర్మిల కూడా ఎంపీ సీటు వ్య‌వ‌హారంలో వ‌చ్చిన తేడా కార‌ణంగానే వివేకా హ‌త్య‌కు గుర‌య్యారని తెలిపారు.

అంతేకాదు.. కావాల్సిన వారే ఆయ‌న‌ను దారుణంగా హ‌త్య చేయించార‌ని విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సీబీఐ సైత‌.. ఈ ఘ‌ట‌న వెనుక చాలామంది పెద్ద‌లు ఉన్నార‌ని తెలిపారు. ఇక‌, ఇప్పుడు ఎంపీఅవినాష్ రెడ్డి విచార‌ణ కూడా తెర‌మీదికి రావ‌డంతో ఈ ఘ‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.