ఏపీ సీఎం జగన్ తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై కలిపి ఆయన కామెంట్లు సంధించారు. ప్రస్తుతం కడప పర్యట నలో ఉన్న జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఒకటి పోతే.. ఇంకొకటి ఆప్షన్ లేదని వ్యాఖ్యానించా రు. తాను ఏపీనే నమ్ముకుని ఉన్నానని చెప్పారు. ఏపీ ప్రజలతోనే తన రాజకీయాలు ఉంటాయన్నారు.
తనకు మరో రాష్ట్రం.. మరో రాజకీయం లేదని.. అవసరం రాదని కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగా ఒక రాష్ట్రంపోతే.. మరో రాష్ట్రంలోనో.. ఒక పార్టీ పోతే.. మరో పార్టీ అనో(పొత్తులు) నేను అనడం లేదు. నాకు ఏపీ ఒక్కరాష్ట్రమే ఉంది. ఒక పార్టీనే ఉంది. ఒక్క రాష్ట్రప్రజలే ఉన్నారు. వారితోనే నా రాజకీ యం అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇక, ఇదేసమయంలో పవన్‌పైనా సటైర్లు వేశారు. చంద్రబాబుతో కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఒక భార్య పోతో ఇంకో భార్య అనో నేను అనడం లేదు. నాది ఒకే రాష్ట్రం.. ఒకే ప్రజలు.. ఒకేపార్టీ.. ఒకే రాజకీయం. ఇక్కడే నా నివాసం.. ఇక్కడే నా రాజకీయం.. ఇదే నా రాష్ట్రం అని జగన్ స్పష్టంచేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates