నియోజకవర్గాల వారీగా చేస్తున్న సమీక్షల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను చంద్రబాబునాయుడు దాదాపు ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసేశారట. అంటే ఖరారు కానీ రెండు నియోజకవర్గాలపై పార్టీలోనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్ధిగా కేశినేని శివనాధ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ లేదా అయన కూతురు పోటీ చేయచ్చట. అభ్యర్థులను ఖరారు చేసేముందు చంద్రబాబు అనేకసార్లు సర్వేలు చేయించుకున్నారు. కొందరు నేతలతో ముఖాముఖి మాట్లాడారు. నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, మైలవరం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమ పోటీ చేస్తారట.
అలాగే తిరువూరు నుంచి వాసం మునయ్య లేదా ఉప్పులేటి కల్పన లేదా డీవై దాసులో ఒకళ్ళు పోటీ చేస్తారు. ముగ్గురు కూడా పోటీకి రెడీ అంటున్నారు. కాబట్టి ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ కేశినేని నాని పోటీ చేస్తారట. సెంట్రల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, బందరు అసెంబ్లీకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరానికి గద్దె అనూరాధ, పెడనకు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, పెనమలూరుకు బోడె ప్రసాద్, పామర్రుకు వర్లకుమార్ రాజ పేర్లు ఖరారయ్యాట.
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేయలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్ధులు దొరకలేదా ? లేకపోతే జనసేనతో పొత్తు కుదురుతుందని అనుకుంటున్నారు. కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలను పొత్తుల్లో కేటాయించేస్తారా అన్నది తేలలేదు. మొత్తానికి రెండు మూడు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్నింటిలోను అభ్యర్దులు దాదాపు ఖరారైపోయినట్లే అన్నది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates