ఏపీలో జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీ.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్‌లో జోడించారు.
రాష్ట్రంలో మద్యం విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విమర్శనాస్త్రాలు సంధించారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివేనని.. చిన్న గమనిక అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మద్యం అమ్మకాల ద్వారా వచ్చే అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వైసీపీ నేతలకే చెందుతోందని ఆరోపించారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్‌లో జోడించారు. వాస్తవానికి కొన్ని రోజులుగా.. రాష్ట్రంలో మద్యం విధానంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు విడతల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన.. జగన్ ఇప్పటి వరకు అమలు చేయలేదు.
పైగా.. మద్యం ధరలు పెంచడం.. నాసిరకం మద్యాన్ని తాగించడం.. ఇప్పటికి మూడేళ్లయినా.. మద్య నిషేధంపై పన్నెత్తు ప్రకటన చేయకపోవడం.. వంటివి ప్రజలను.. మద్యతరగతివారిని కూడా ఇరకాటంలో పడేస్తున్నాయి. మరోవైపు.. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. తాజాగా 8 వేల కోట్ల రూపాయల మేరకు బేవరేజెస్ కార్పొరేషన్ వచ్చే ఐదేళ్లలో మద్యం అమ్మకాలను ఎరగా చూపి.. అప్పులు చేయడం మరింత కలకలం రేపుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates