టీడీపీలో అంతర్గత చర్చ ఊపందుకుంది. పార్టీలో సంఖ్యా పరంగా చూసుకుంటే. టీడీపీకి బాగానే నాయకులు ఉన్నారు. పైగా.. వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్మకంగా.. అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం.. యువత ఎక్కువగా ఉన్న పార్టీ టీడీపీనే ఇలాంటి వారంతా.. వచ్చే ఎన్నికల్లో.. పార్టీని గెలిపించాలని.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని.. అధినేత చంద్రబాబు చెబుతున్నారు.
అయితే.. సీనియర్లు.. వ్యాపారులు… పారిశ్రామిక వేత్తలు.. ఇలా.. అనేక మంది మాత్రం మౌనంగా ఉంటున్నారు. అలాగని.. వీరికి పార్టీపై అభిమానం లేదని కాదు.. పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని లేకాకాదు. పైగా వీరంతా.. `వ్యూహాత్మక రాజకీయం`చేయడంలో దిట్టలు. అవసరాన్ని బట్టి.. రాజకీయాలు చేయడం.. అవసరం మేరకు వ్యవహరించడం.. వారికి రాజకీయంగానే కరతలామలకం.
దీంతో వారు తమ ఆనుపానులతోపాటు.. టీడీపీ ఆనుపానులు కూడా చూసుకుంటున్నారు. అంటే.. ఇప్ప టికిప్పుడు వారు ఎలాంటి హడావుడి చేయరు. చంద్రబాబు మాటలను జాగ్రత్తగా ఆలకిస్తారు. కానీ, ఆయన చెప్పినట్టు మాత్రం బయటకు రారు. ఎందుకంటే.. వీరికి అటు అధికార పార్టీ, ఇటుప్రతిపక్ష పార్టీ కూడా ముఖ్యమే! ఎందుకంటే.. టీడీపీలోనే ఉన్న వీరు.. ఖర్చులకు ఎక్కడా వెనుకాడరు.
కానీ, ఫక్తు బిజినెస్ మైండ్. అంటే.. తమకు ఫలితం వస్తేనే వీరు ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంటారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని భారీ ఎత్తున ప్రచారం జరగడంతో వీరు కూడా అదేరేంజ్‌లో డబ్బుఖర్చు చేశారు. తీరా పరిస్థితి తిరగబడింది. దీంతో .. ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే సూచనలు ఉంటేనే బయటకు రావాలని.. లేకపోతే.. వద్దని డిసైడ్ అయినట్టు వీరి మద్య గుసగుస వినిపిస్తోంది.
వీరిది వ్యూహాత్మక రాజకీయం కావడంతో చంద్రబాబు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీ పుంజుకున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. పైగా.. గ్రాఫ్‌కూడా పెరిగిందనే టాక్ పార్టీ అధినేత నుంచి కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా నేతలను తిరిగి నడిపించాలనే డిమాండ్ వినిపిస్తుండడం గమనార్హం. మరి పార్టీ అధినేత చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.