తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పెగాసస్ వ్యవహారంలో ఇరికించాలి అని భావిస్తున్న వైసీపీకి అనూహ్య పరిణామాలే ఎదురవుతున్నాయి. అదేవిధంగా సభలో సభ్యుల మాట తీరుపై కూడా మీడియాలో కథనాలు వస్తుండడంతో ఇంకా విషయం తీవ్ర తరం అవుతూ వస్తోంది.ఇదే దశలో తాము ఏ నిఘా సంబంధ వ్యవహారాలను ప్రొత్సహిస్తూ స్పైవేర్ ను కొనుగోలు చేయలేదని పదే పదే టీడీపీ చెబుతుండడం, అదేవిధంగా సభా సంఘానికి పట్టుబట్టడంతో ఒక్కసారిగా ఈ విషయంలో ఓ విధంగా విజయం తెలుగు దేశాన్ని వరించింది అనే చెప్పాలి. దీంతో తగాదా ఎక్కడిదాకా పోతుందో అని వైసీపీ కూడా కాస్త వెనక్కు తగ్గి మాట్లాడుతోంది.
ఈ దశలో పెగాసస్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లిపోతోంది. ఇప్పటికే దీనిపై కొన్ని వివరాలు అందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని సభా సంఘం ఎదుట హాజరయ్యేలా చేయగలరా అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. పెగాసస్ స్పై వేర్ ను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేశారని దీదీ చెప్పిన మాటలతో ఏపీ అసెంబ్లీ ఒక్క ఉదుటున ఊగిపోయింది. విపక్ష మరియు స్వపక్ష సభ్యుల మధ్య ఆగ్రహావేశాలు రాజుకున్నాయి.
ఈ తరుణంలో చంద్రబాబు వర్గంకు జగన్ వర్గంకు మధ్య రేగిన వివాదం ఒక్క సారిగా పై స్థాయికి చేరిపోయింది. మొత్తానికి స్పీకర్ కాస్త తగ్గి సభా సంఘం ఏర్పాటు చేశారు. ఇందుకు వైసీపీ మరియు టీడీపీ వర్గాలు ఏక కాలంలో విన్నవించడం కూడా దోహదం అయింది. దీంతో త్వరలో సభా సంఘం ఏర్పాటై మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయనుంది.
ఇక ఈ సాఫ్ట్వేర్ ను ఎవరికి పడితే వారికి అమ్మరని జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా అంటున్నారు. అదేవిధంగా ప్రయివేటు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు వీల్లేదని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో శాసన సభ మాత్రం ఇందుకు విరుద్ధంగా వాదులాటకు తావిస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా తాము ఆ స్పై వేర్ ను కొనుగోలు చేయలేదని పదే పదే టీడీపీ అంటోంది రేపటి వేళ ఇదే కనుక నిరూపణ అయితే వైసీపీ ఏం సమాధానం చెప్పనుందో కూడా ఆసక్తికరంగా ఉంది. ఓ విధంగా జగన్ ఇరుక్కుపోయారు అనే చెప్పాలి. సభా సంఘం నియమించి ఆయన తెలుగుదేశం పార్టీ వ్యూహంలో ఇరుక్కుపోయారు.