పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ లో తీవ్ర అవ్యవస్థ నెలకొంది. భారత్ చర్యల నేపథ్యంలో పాక్ లో భయటపడని భయం నెలకొందనే సంకేతాలు వస్తున్నాయి. పాక్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సందర్భంలోనే భారత్ పై కావాలని విషం చిమ్మారు అనేది మరో కారణం. దేశం మీద మరక పడకూడదని జనాల దృష్టిని మళ్ళించి ఈ తరహా గొడవలు క్రియేట్ చేస్తున్నారనే ఉదాహరణలు అందుతున్నాయి. ఇక భారత్ ప్రతిఘటన అనంతరం ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మిస్సింగ్ అయ్యాడన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
ఆయన కుటుంబాన్ని ప్రైవేట్ జెట్ ద్వారా విదేశాలకు తరలించారన్న ప్రచారం మునుపెన్నడూ లేని ఆసక్తి రేపింది. ఈ వార్తలపై స్పందించిన పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం, మునీర్ దేశంలోనే ఉన్నాడని గ్రూప్ ఫోటో విడుదల చేసి ప్రచారాన్ని ఆపాలని ప్రయత్నించింది. అయితే అసలు మునీర్ కనిపించకుండా ఉండటం, మీడియా ముందుకు రాకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. పాక్ అధికారిక వర్గాలు ఎన్ని నిరాకరణలు చేసినా, ప్రజల్లో గగ్గోలు మాత్రం మాయం కాలేదు.
ఇటీవల మునీర్ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. కశ్మీర్ పాకిస్థాన్ జీవనాడి అని, అది సాధించేందుకు ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని రెచ్చగొట్టేలా మాట్లాడారు. విదేశాల్లోని పాకిస్థానీలకు ‘హిందువుల నుంచి భిన్నత్వం’ గురించి చెబుతూ, ద్విజాతి సిద్ధాంతాన్ని నాటకీయంగా వివరించారు. మునీర్ మాటల తర్వాతే పహల్గాం దాడి జరగడం మరింత అనుమానాస్పదంగా మారింది.
భారతదేశం మాత్రం దీని తాలూకు ప్రతి చర్యగా సముద్రం మీద ఐఎన్ఎస్ విక్రాంత్ ను మోహరించింది. అరేబియా సముద్రంలో INS సూరత్ నుంచి క్షిపణి ప్రయోగం చేసి మునుపటి కన్నా బలమైన వార్నింగ్ ఇచ్చింది. ఈ దశలో మునీర్ మిస్సింగ్ వార్తలు బయటకు రావడం, పాక్ లో రాజకీయ, సైనిక గందరగోళాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. మొత్తానికి, ఆసిమ్ మునీర్ మిస్సింగ్ రూమర్స్ అబద్ధం అయితే అతను డైరెక్ట్ గా మీడియా ముందుకు ఎందుకు రావడం లేదనే కౌంటర్లు వస్తున్నాయి. మరి దీనికి పాక్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates