భారత ప్రధానిగా ప్రస్తుతం నరేంద్రమోడీ కొనసాగుతున్నారు. ఆయన కాకుండా.. భవిష్యత్తులో ఆ పదవిని అదిరోహించేంది ఎవరు..? అసలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఎవరికైనా ఉందా..? కాంగ్రెస్ ఈసారైనా నిలపడగలదా..? లేదా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటై.. అది బీజేపీ ని ఓడించగలదా..? వంటి ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడింది ప్రశ్నం అనే సంస్థ. ఈ మేరకు 12 రాష్ట్రాల్లో సర్వే కూడా చేసింది.
ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, బీహర్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాల్లో 397లోక్ సభ స్థానాల పరిధిలోని 2,309 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20వేల మందిని సర్వే చేశారు. ఎవరు మోడీకి ధీటుగా నిలబడి ప్రధాని కాగలరు అన్నది సర్వేలో ప్రశ్న.
భవిష్యత్తులో ఎవరు పీఎంగా ఉంటే బాగుంటుందనే ప్రశ్నని సర్వేలో ఉంచగా… ఈ సర్వేలో ప్రధానిగా మళ్లీ మోడీ నే ఉండాలని 32.8శాతం మంది ఓటేయగా, రాహుల్ గాంధీ వైపు 17.2శాతం మంది ఓటేశారు. ఇక థర్డ్ ఫ్రంట్ కూటమి ప్రయత్నాల్లో ఉన్న శరద్ పవార్ ను కేవలం 0.9శాతం మంది ఎంపిక చేయగా… మమతా బెనర్జీ వైపు 7శాతం ఓటేశారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కేవలం 0.7శాతం మంది మాత్రమే కోరుకున్నారు. అంటే మోడీ తర్వాత జనం రాహుల్ వైపే మొగ్గుచూపుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates