గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో పుష్కర్ ఘాట్ సమీపంలో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్తతో కలిసి.. పుష్కర్ ఘాట్‌కు వచ్చిన యువతిని ఆమెకు కాబోయే భర ముందే అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన నిందితుల ఘటన.. పెద్ద ఎత్తున వివాదంగా మారింది. సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలో ఇలా జరగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ తాజాగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా.. సీఎం జగన్‌పై తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. “రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారు? సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగులేశారు.. ఇప్పుడు ఏమయ్యారు?” అని లోకేష్ నిలదీశారు.
జనం తిరగబడతారనే భయంతో రెండేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్‌లో హోం ఐసోలేషన్ అయిన సీఎం జగన్ రెడ్డి గారూ! మీ ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా? అని లోకేష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్? అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్న పిరికి పంద జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్ధకమైంది..అంటూ.. జగన్‌పై లోకేష్ నిప్పులు చెరిగారు. ఈ ట్వీట్‌కు సదరు అత్యాచార ఘటనకు సంబంధించిన వార్తలను జత చేశారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates