ఏపీలో లిక్కర్ బ్రాండ్ల పేర్లు…జగన్ పాలనపై సెటైర్లు?

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు….ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చేవరకు నిద్రపోమంటూ వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాడుతూనే ఉంటామని, కేంద్రం మెడలు వంచైనా హోదా తీసుకువస్తామని ఏపీ సీఎం జగన్ కూడా ఎన్నికలకు ముందు గట్టిగానే చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం జగన్…ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ…ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎలాగైతేనేం…మాట తప్పని మడమ తిప్పని జగనన్న….ఏపీకి ‘Special Status’ తెచ్చేశారంటూ కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏపీకి సంజీవని వంటి అసలు సిసలు ‘Special Status’ సాధించడంలో విఫలమైన జగన్ అండ్ గ్యాంగ్…ఏదోలా తంటాలు పడి ఏపీలో మందుబాబులకు మాత్రం ‘Special Status’ లిక్కర్ బాటిల్ సాధించారంటూ సెటైర్లు పేలుతున్నాయి.

ఈ క్రమంలోనే ఏపీకి గతంలోనే ‘president medal’ తెచ్చిన జగన్…ఇపుడు తాజాగా ఏపీని డెవలప్ చేసేందుకు ‘development’ పేరుతో కొత్త లిక్కర్ బ్రాండ్ ను తీసుకువచ్చారు. దీంతో, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో మీమ్స్స్ పేలుతున్నాయి. జగన్ సర్కార్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఏపీని డెవలప్ చేయడంలో విఫలమైన జగన్…ఈ రకంగా ‘development’ పేరుతో లిక్కర్ బాటిల్ తెచ్చి తృప్తి చెందుతున్నారంటూ సెటైర్లు పేలుతున్నాయి.

ఏపీకి జగన్ special status సాధించడంతో రాష్ట్రంలో విపరీతంగా development జరిగిందని అందుకుగాను జగన్ కు president medal వచ్చిందని టీడీపీ అభిమానులు పంచ్ లు వేస్తున్నారు. తనకు ‘polavaram’ కావాలని ఓ నెటిజన్ వేసిన సెటైర్ వైరల్ అవుతోంది. ఇక, మరికొందరైతే ఏపీలో లేని…ఏపీకి రాని వాటి పేర్లు మద్యం బ్రాండ్లకు పెడుతున్న కంపెనీలు, జగన్ పాలనను ఎద్దేవా చేస్తున్నాయోమోనని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఏపీలో లిక్కర్ కంపెనీలు జగన్ పాలనపై సెటైర్లు వేస్తున్నాయా? అని అనుమానాలు వ్యక్తం చేస్తూ మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.