వైరస్ ల్యాబ్ లోనే పుట్టింది.. గడ్కరీ

ప్రపంచానికి గుది బండలా మారిన మాయదారి వైరస్ మీద ఉన్న వాదనలు అన్ని ఇన్ని కావు. ఇది సహజసిద్ధంగా పుట్టిందా? ల్యాబుల్లో పుట్టిందా? అన్న దానిపై ఇప్పటికే పలువురు పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా భారత్ పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇంత జరుగుతున్నా.. వైరస్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడని పరిస్థితి.

ఇలాంటివేళ.. సంచలన వ్యాఖ్యలు చేశారు నితిన్ గడ్కరీ. కరోనా వైరస్ సహజసిద్ధంగా పుట్టుకొచ్చింది కాదని.. ల్యాబుల్లో పెరిగినట్లుగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు వచ్చిన సందేహాలే.. అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి కూడా వచ్చాయన్న మాటను గడ్కరీ ప్రస్తావించటం గమనార్హం.

వైరస్ ను ల్యాబుల్లో ప్రయోగిం వల్లనే ఇప్పుడున్న పరిస్థితి ఏర్పడిందని.. ఇలాంటిది ఒకటి వస్తుందని తాము కలలో కూడా ఊహించలేదన్నారు. సాక్ష్యాత్తు కేంద్రమంత్రి నోటి నుంచి వచ్చిన సందేహంలో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

కరోనా కట్టడిని ఎక్కువకాలం ఆపలేమన్న చేదు వాస్తవాన్ని ఆయన చెప్పేశారు. ఎక్కువకాలం లాక్ డౌన్ ను కొనసాగిన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తథ్యమని చెప్పక తప్పదు.