స్వతంత్ర భారత దేశంలో గతంలో ఎన్నడూ జరగని.. ఎప్పుడు కనీ వినీ ఎరుగని సంఘటనలు చోటు చేసు కుంటున్నాయి. ఫలితంగా ఈ ఎఫెక్ట్.. ప్రధాని నరేంద్ర మోడీపై ఎక్కువగానే ఉంది. మరీ ముఖ్యంగా అంత ర్జాతీయంగా.. నేను ఎంతో కీర్తి గడించాను. తిరుగులేని పాలనతో.. దూరదృష్టితో అంతర్జాతీయ పొలిటికల్ అవనికపై నా ప్రభ జగజ్జగేయమానంగా మెరిసిపోతోంది!!
అని చెప్పుకొనే మోడీకి ఇప్పుడు మూడు ప్రధాన విషయాలు ప్రాణసంకటంగా మారాయి. ఈ మూడు విషయాలు కూడా రైతు వ్యవసాయ చట్టాలకే సంబంధించిని కావడం గమనార్హం.
- రైతుల ఆందోళన:
నూతన వ్యవసాయ చట్టాలపై పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల రైతులు ఉద్యమించారు. ఢిల్లీ సరిహద్దులో మోహరించి నెలల తరబడి ఉద్యమం చేశారు. ఎముకలు కొరికే చలిలోనూ వారు ఆందోళన కొనసాగించారు. ఫలితంగా మోడీ సర్కారుకు ఇంటా బయటా.. తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అంతర్జాతీ య సమాజం నుంచి కూడా మోడీనికి ఎదురీత ఎదురైంది. బ్రిటన్ సహా ఐక్యరాజ్యసమితి కూడా రైతులకు మద్దతు పలికింది. రైతులపై బల ప్రయోగం వద్దంటూ. . సూచనలు రావడం గమనార్హం. - ఎర్రకోట ధ్వంసం:
రైతు ఉద్యమాన్ని నిలువరించడంలోను, వారిని శాంత పరచడంలోనూ కేంద్ర ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందనే వాదన దేశంలోనేకాదు. అంతర్జాతీయంగా కూడా వినిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు.. రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర వివాదానికి దేశ అత్యున్నత వేదిక అయిన ఎర్రకోట విధ్వంసానికి దారితీసింది. దీనిపై అంతర్జాతీయ సమాజం నివ్వెర పోయింది. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న వాదన బలంగా వినిపించడం గమనార్హం. దీనిని నిలువరించలేక పోయారనే వ్యాఖ్యలు మోడీ చట్టూ ముసురుకోవడం విశేషం. - విపక్షాల బహిష్కరణ:
ఇది అన్నింటికన్నా.. కీలక పరిణామం. ఏకంగా 18 ప్రతిపక్ష పార్టీలు.. ప్రస్తుతం ప్రారంభమైన లోక్ సభ సమావేశాలను బహిష్కరించడం. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన ప్రతిపక్షాలు ఉన్నాయి. అయితే.. ఆయా పార్టీలకు నచ్చజెప్పి లైన్‌లోకి తెచ్చుకున్న అధికార పక్షాలు ఉన్నాయి. కానీ, మోడీ సర్కారు మాత్రం విపక్షాలను తృణీకరిస్తోందనే వాద న బలంగా వినిపిస్తోంది. గతంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని వినేందుకు విపక్షాలు సిద్ధమయ్యేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. ఇది కూడా తాజాగా అంతర్జాతీయ వేదికలపై ప్రధాన చర్చనీయాంశం కావడం గమనార్హం. అయినా.. మోడీ మాత్రం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరించడం గమనార్హం.