Political News

మాటలు చెప్పినంత మాత్రాన తాను దీక్ష ఆపేది లేదు

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం తనకు హామీ ఇచ్చినట్లు ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఇటీవల వెల్లడించారు. జాతీయ స్థాయిలో సంచలనం రేపుతున్న ఈ ఇష్యూలో వాంగ్‌చుక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వాంగ్‌చుక్ ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా ఆయనను కలిసి దీక్ష విరమించాలని కోరారు. ఆ సమయంలోనే మంత్రి రాజీనామాతో పాటు, నీట్ లీక్ వివాదం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చినట్లు వాంగ్‌చుక్ ఒక లేఖ ద్వారా తెలిపారు.

అయితే కేంద్రం ఈ మాటలు చెప్పినంత మాత్రాన తాను దీక్ష ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ పోరాటంలో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై భవిష్యత్తులో ఎలాంటి లీగల్ కేసులు పెట్టబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని రాతపూర్వకంగా ఒక గ్యారెంటీ ఇస్తేనే తాను ఈ ఆమరణ దీక్ష విరమిస్తానని కరాఖండీగా స్పష్టం చేశారు.

జూలై 20వ తేదీన జరిగిన ‘చలో సంసద్’ మార్చ్ లో పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. పోలీసులు వ్యవహరించినా తీరు అతిగా ఉందని, అయినా కూడా విద్యార్థులు చాలా శాంతియుతంగానే నిరసన తెలిపారని వాంగ్‌చుక్ అన్నారు. ఒక పారదర్శకమైన విద్యావ్యవస్థ కోసం గళం విప్పడమే ఆ యువత చేసిన నేరమా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన సుమారు 65 మంది ఎంపీలు తనను కలిసి దీక్ష ఆపాలని కోరినట్లు వెల్లడించారు.

తనకు కూడా ఆరోగ్యంగా బతకాలని ఉందని, తిరిగి తన విద్యార్థుల దగ్గరకు వెళ్లి పాఠాలు చెప్పాలని ఉందని ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. కానీ ఎవరి భవిష్యత్తు కోసమైతే ఈ ఉద్యమం మొదలుపెట్టామో ఆ యువతను పోలీసు కేసుల పాలుచేసి తాను వెనక్కి తగ్గలేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి నిరసనకారుల భద్రతపై సరైన గ్యారెంటీ రాకపోతే తన దీక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని ఆయన తేల్చి చెప్పారు.

This post was last modified on July 22, 2026 6:11 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

54 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago