Political News

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల పాటు చికిత్స తీసుకున్న ఆయన ఈ నెల 19 వ తేదీన తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. వచ్చిరాగానే విధుల్లో పడిపోయారు. అంత బిజీలో కూడా సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటన చేస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని శ్రీ సీతారామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ముక్కుసూటిగా మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గురించి, పార్టీ కమిటీల గురించి కుండబద్దలు కొట్టినట్లు కామెంట్స్ చేశారు. తాను పిఠాపురంలో కూర్చుంటే కుదరదని, అభివృద్ధి చేయాలంటే రాజధానిలో కూర్చోవడం తప్పదని చెప్పారు. నియోజకవర్గంలో నేను కనిపించడం లేదని విమర్శలు చేస్తున్నారని, రైతాంగానికి నీళ్లు కావాలని, పంటపొలాలు ఎండిపోకుండా చేయాలంటే ఇక్కడ కూర్చొని ఊరికే కన్నీళ్లు తుడుస్తే నీళ్లు రావన్నారు.

ఏ తీగ లాగితే, ఏ పావు కదిపితే పనులవుతాయో నాకు తెలుసన్నారు. నేను రోజూ నియోజకవర్గానికి వచ్చి పని చేస్తున్నట్లు కనిపించేలా చూడొచ్చు, కానీ పనులవ్వవని స్పష్టం చేశారు. ఈ మాటల ద్వారా పార్టీలో, పార్టీ బయట తన మీద వస్తున్న విమర్శలకు నిక్కచ్చిగా జవాబు చేశారు. నిజానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఆయన రాష్ట్రం మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. సాధారణ నాయకుడి తరహాలో ఇరవై నాలుగు గంటలు నియోజకవర్గంలోనే కూర్చోలేడు కదా.

ఇక నాయకులు, కార్యకర్తల విషయంలో కూడా వున్నది ఉన్నట్టు మొఖం మీద అనేశారు. పిఠాపురంలో తాను నియమించిన జనసేన కమిటీ సరిగ్గా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను నాయకులను నమ్మాను. నా ప్రతినిధులుగా నియమించాను. అయితే కమిటీ తీరు తెన్నులు సరిగా లేవని నాకు తెలుసని స్పష్టం చేశారు. అధికారంలో లేనప్పుడు అందరిలో వేడి రక్తం వుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత రక్తం చల్లబడిందని వ్యాఖ్యనించారు. తిరిగి రక్తం వేడయ్యేందుకు ఏమి చేయాలో నాకు తెలుసని చెప్పారు. ప్రజల ఆలానా పాలనా మీరే చూడాలని స్థానిక నాయకులకు సూచించారు.

మూడు నాలుగు నెలల్లో పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయమని పొద్దున్నే నా పేషి అధికారులకు చెప్పినట్లు డీసీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కుదురుతుందో లేదో తెలియదు కానీ ఇది నా కోరిక అని, మీ అందరి సహకారం, ఆశీస్సులతో ఇక్కడే క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేస్తానని తెలిపారు. దాంతో జనసేన నాయకులు, కార్యకర్తలు సంతోషంతో ఈలలు వేశారు. అధికారుల మొహాల్లో సైతం ఆనందం కనిపించింది.
పవన్ కళ్యాణ్ పర్యటన ఆద్యంతం నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కనిపించారు.

This post was last modified on September 22, 2026 2:51 pm

Share

Recent Posts

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

1 hour ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

2 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

4 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

7 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

7 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

8 hours ago