Movie News

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం దాకా నిర్మాతలు నరకం చూశాక బయటికి వస్తాయి. కొన్నింటికి జిఓలు టైంకి ఇచ్చినా కంటెంట్ డెలివరీలో సమస్యల వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ వెంటనే మొదలుపెట్టలేని పరిస్థితి తలెత్తుతుంది. ప్యారడైజ్ కు ఇది అనుభవమవుతోంది. మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న కొద్దీ చాలా సెంటర్లలో ఇంకా స్పెషల్ షో టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాలేదు.

తెలంగాణలో కాసేపటి క్రితం స్టార్ట్ చేయగా ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ బుకింగ్స్ ఏ క్షణంలో అయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు. ఆల్రెడీ మొదటి రోజుకు సంబంధించిన అమ్మకాలు జోరుగా ఉన్నాయి. గంటకు పన్నెండు నుంచి ఇరవై వేల మధ్యలో బుక్ మై షోలో అమ్ముడుపోతున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ అదనం. కౌంటర్ సేల్స్ విడిగా ఉంటాయి. బిసి సెంటర్ల ప్రీమియర్ షోలు దాదాపుగా ఇదే పద్ధతిలో అమ్మకాలు చేసుకుంటాయి. సో షాకింగ్ నెంబర్లు నమోదు కావడం ఖాయం.

టాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత థియేటర్లు కిక్కిరిసిపోయే రోజులు వచ్చేశాయి. పెద్ది తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ వచ్చాయి కానీ అవేవి స్టార్ క్యాస్టింగ్ తో ఉన్నవి కాదు. ఇరుముడి తప్ప మహా అయితే గరిష్టంగా వంద కోట్ల వరకు వెళ్ళినవి. కానీ ప్యారడైజ్ అలా కాదు. యునానిమస్ టాక్ వచ్చి హిందీలోనూ హిట్ టాక్ సంపాదిస్తే రెండు వందల కోట్ల మార్కు పెద్ద విషయమే కాదు. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. రేపు అర్ధరాత్రి దాకా ఈ విషయంలో మహా సస్పెన్స్ తప్పేలా లేదు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ప్యారడైజ్ లో నాని, కయదు లోహర్ జంటగా నటించగా కీలకమైన తల్లి పాత్రను సోనాలి కులకర్ణి పోషించారు. మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ విలనీ చాలా హింసాత్మకంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. సెన్సార్ ఏకంగా 21 మార్పులు చెప్పడం అంటే మాములు విషయం కాదు. దురంధర్, మార్కోని మించిన వయొలెన్స్ ఇంచులో చూస్తారని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అదే నిజమైతే తెలుగు తెర ఇంతముందు చూడని రక్తపాతం ఆవిష్కృతం కానుంది.

This post was last modified on September 22, 2026 8:09 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

2 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

4 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

5 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

5 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

5 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

6 hours ago