Movie News

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు. కానీ ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులు అట‌కెక్కేశాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొన్నేళ్లు అవార్డులిచ్చింది. ఆ ప్ర‌భుత్వం పోయాక.. జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలో ఈ అవార్డుల‌ను ప‌క్క‌న పెట్టేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం అస‌లు అవార్డుల సంగ‌తే ప‌ట్టించుకోలేదు.

రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను తీసుకొచ్చి కొన్నేళ్ల‌కు క‌లిపి ఒకేసారి పుర‌స్కారాలు ప్ర‌క‌టించింది. 2025కు సంబంధించి కూడా కొన్ని నెలల ముందే అవార్డులు ప్ర‌క‌టించారు. మ‌రి ఏపీలో నంది అవార్డుల పునరుద్ధ‌ర‌ణ ఎప్పుడా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఉగాదికి అవార్డులు ఉంటాయ‌ని చ‌ర్చ జ‌రిగింది కానీ.. అదేమీ జరగలేదు. ఐతే ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డుల గురించి అప్‌డేట్ వచ్చింది. నంది అవార్డుల గురించి ఎఫ్డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

గతంలో 2012 నుంచి 2016 వరకు నంది ఫిలిం, టీవీ అవార్డులను గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని విజేతలకు అందించలేదు. వాటిని ఇప్పుడు అందించడమే కాక.. 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి నాలుగు అవార్డుల (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ అవార్డులు) కోసం విజేతలను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు భరత్ భూషణ్ తెలిపారు. అలాగే 2025 సంవత్సరానికి నంది ఫిలిం, టీవీ అవార్డులను అందించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

నంది అవార్డులకు సంబంధించి అమరావతి లేదా విజయవాడలో భారీ ఈవెంట్ చేయబోతున్నట్లు భరత్ భూషణ్ తెలిపారు. టీవీ అవార్డుల కోసం తిరుపతిలో ఈవెంట్ ఉంటుందన్నారు. అక్టోబరులో నంది, టీవీ అవార్డుల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తామని.. నవంబరులో అవార్డుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని.. డిసెంబరులో అవార్డుల ప్రదానోత్సవాలు జరుగుతాయని భరత్ భూషణ్ వెల్లడించారు. ఫిలిం విభాగంలో మొత్తం 46 అవార్డులు అందించనున్నట్లు ఆయన తెలిపారు.

This post was last modified on September 22, 2026 6:12 pm

Share

Recent Posts

నాయుడుకు రెన్యువ‌ల్ ఉంటుందా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ పోస్టులో ఉన్న ప్ర‌ముఖ మీడియా అధిప‌తి బీఆర్ నాయుడు ప‌రిస్థితి సందిగ్ధంలో…

2 minutes ago

మౌళిని కమర్షియల్ వింగ్‌లోకి లాగుతున్నారా

గత ఏడాది లిటిల్ హార్ట్స్ తో పరిచయమైన మౌళికి అంతకు ముందే సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ…

9 hours ago

ఇది నాకోసం కాదు – మన కోసం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ శ్రేణులు, నాయ‌కుల‌ను ఉద్దేశించి…

11 hours ago

మిథున్ రెడ్డి ఎక్కడున్నారు?

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందా? ఆయ‌న ఆచూకీ కూడా క‌నిపించ‌డం…

11 hours ago

బెజవాడలో వంగవీటి వన్‌మ్యాన్ షో

ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అయిన విజయవాడలో ఇప్పుడు పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవసం…

12 hours ago

తమన్ స్టేట్‌మెంట్‌లో ఇంత అతిశయమా

తమకు ఇష్టమైన దర్శకులను పొగుడుకోవడంలో సెలబ్రిటీలు అనుసరించే పద్ధతులు, వాడే పదాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కోసారి ఇవి అతిశయోక్తిగా మారి…

12 hours ago