జాతీయ గేయం వందేమాతరం వ్యవహారంపై జరుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ గీతం ఆచరణలో ఉంది. అప్పట్లో పెద్దలు నిర్ణయించిన మేరకు.. ఈ గీతంలోని తొలి రెండు చరణాలను అధికారికంగా ఆలపిస్తున్నారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా. దీనికి ప్రజలు అలవాటు పడ్డారు. అయితే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. వందేమాతరం వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ఈ గీతాన్ని రచించిన బకించంద్ర చటర్జీ 150వ జయంతిని పురస్కరించుకుని మొత్తంగా గీతాన్ని ఆలపించాలని షరతు విధించింది.
అంతేకాదు.. పూర్తి గీతం ఆలపించకపోతే.. మూడేళ్ల శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమాని విధించేలా.. జాతీయ గీతాల గౌరవ చట్టంలో ఈ ఏడాది మార్పులు చేసి.. దీనిలో వందేమాతరం గేయాన్ని కూడా చేర్చారు. ఇక, ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మొత్తం వందేమాతరం గేయాన్ని ఆలపించేది లేదని తీర్మానం చేసి.. అలానే సాగుతున్నారు. తమిళనాడులోనూ విజయ్ ప్రభుత్వం కేంద్రం ఆదేశాలను పక్కన పెట్టింది.
ఇలా ఉన్న ఈ వ్యవహారంపై ప్రముఖ సంగీత దర్శకుడు టీఎం కృష్ణ.. సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. అసంపూర్తిగా పాడుతున్నారని.. కేంద్రం నిబంధనలు తెచ్చినా.. పాటించడం లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై తాజాగా విచారణ చేసిన సుప్రీంకోర్టు.. తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. వందేమాతరం గేయాన్ని ఇలానే పాడాలని.. ఇన్ని చరణాలు పాడాలని ఎవరూ నిర్దేశించలేరని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రజలకు ఇష్టమైతే.. మొత్తం గేయాన్ని ఆలపిస్తారని తెలిపింది.
దీంతో పిటషనర్ షాకయ్యారు. తాను కోరుకున్నట్టుగా ఆదేశాలు రాకపోవడంతో.. సుప్రీంకోర్టు దారి తప్పుతోందని వ్యాఖ్యానించారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. తాము ఏ విషయాన్నయినా.. చట్ట ప్రకారమే విచారిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ కేంద్రం చట్టం చేసిందని చెబుతున్న నేపథ్యంలో ఆ చట్టాన్ని కూడా తాము పరిశీలిస్తామని పేర్కొంది.
రాజ్యాంగంలో పేర్కొన్న మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరించే ఏ చట్టమూ సమ్మతం కాదని.. కేంద్రం ఎలాంటి శిక్షలు విధించాలని పేర్కొందో పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికైతే.. వందేమాతరం రెండు చరణాలా, నాలుగా ఆరా .. అనేది ప్రజల ఇష్టమేనని తేల్చి చెప్పింది.
This post was last modified on September 22, 2026 4:54 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…