ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద మైలురాళ్ళు, సామాన్యులకు సాధ్యం కానివి అందుకున్న వాళ్ళు, చరిత్రలో చెప్పుకోవాలి అనిపించే పేర్లు, ఘటనలు అందులో ఉండేవి. దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదంటే ఈ పుస్తకం పేరు మీద దూరదర్శన్ ఛానల్ లో వీక్లీ సీరియల్ వచ్చేది. దాని కోసం పనులు మానుకుని ప్రేక్షకులు ఎగబడి చూసేవాళ్ళు. ఖరీదైనా సరే గిన్నిస్ బుక్కుని కొనేవాళ్ళ సంఖ్య లక్షల్లోనే.
ఇదంతా ముప్పై సంవత్సరాల వెనుకటి ముచ్చట. క్రమంగా గిన్నిస్ బుక్ వైభవం తగ్గుతూ వచ్చింది. అప్పుడప్పుడు మనోళ్లు అందులో చోటు సంపాదించుకుంటున్నా జెన్ జీ జనాలు ఎక్కువ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం రాకా మేకింగ్ వీడియో. ఒకేసారి 37 ఆర్టిస్టుల మీద మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఎపిసోడ్ తీయడం ఆ బుక్కు నిర్వాహకులను ఆకర్షించి రికార్డు వచ్చేలా చేసింది. దీన్నే అట్లీ బర్త్ డే సందర్భంగా వీడియోని విడుదల చేసింది టీమ్.
అయితే దీని గురించి సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్లు కనిపిస్తున్నాయి. గిన్నిస్ బుక్ కు అంత సీన్ ఉందా అని కొందరు, ఏదేదో ఊహించుకుంటే చివరికి ఇలా నిరుత్సాహ పరుస్తారా అంటూ మరికొందరు కామెంట్ల రూపంలో తమ నిరసన వ్యక్తం చేశారు. గిన్నిస్ గొప్పదనం తెలిసి వావ్ అనుకున్న వాళ్ళు లేకపోలేదు. అయితే ఈ పర్సెంటెజ్ పరిమితంగానే ఉంటుంది. బాలీవుడ్ మీడియా అయితే దీనికా ఇంత హడావిడి చేశారంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
వారణాసి తర్వాత అంత గ్రాండియర్ మూవీగా అంచనాలు రేపుతున్న రాకా నుంచి ఏదైనా సాలిడ్ కంటెంట్ రావాలనేది అభిమానుల కోరిక. అయితే రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాకుండా అలాంటి ఆలోచన అట్లీ చేయలేడు. అందుకే ఇలా సర్దిపుచ్చుతున్నారు. ఈ ఏడాది మొత్తంలో ఎలాంటి టీజర్ రాకపోవచ్చని విశ్వసనీయ సమాచారం. నూతన సంవత్సర సందర్భంగా స్పెషల్ అప్డేట్ ఉండొచ్చేమో కానీ అప్పటిదాకా వెయిటింగ్ చేయక తప్పదు. హైప్ ఆ రేంజ్ లో ఉంది మరి.
This post was last modified on September 22, 2026 8:07 pm
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…