రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన, ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు వంటి ప్రతిష్టాత్మక కార్పొరేషన్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జనసేన వ్యూహం – ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. కీలక స్థానాలపై గురి పెట్టిందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు నగరపాలక సంస్థల మేయర్ స్థానాలను తమకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు.
వంద శాతం స్ట్రైక్ రేట్
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా గెలుపొంది, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించే దిశగా పవన్ కల్యాణ్ నేతృత్వంలో పార్టీ యంత్రాన్ని సన్నద్ధం చేస్తున్నారు. గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు తీసుకున్నారన్న విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా 21 స్థానాలకే పరిమితం అయ్యారు. అయితే.. తీసుకున్న ప్రతి స్థానంలోనూ జనసేన విజయం దక్కించుకుంది. ఇప్పుడు కూడా అదే పంథాలో సాగాలని పవన్ కోరుకుంటున్నారు. కానీ, క్షేత్రస్థాయి నాయకులు మాత్రం ఎన్ని తీసుకున్నా.. గెలిచేస్తామన్న భరోసా వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ బలోపేతం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత వస్తున్న మలి ఎన్నికలు స్థానిక సంస్థలవే. దీంతో వీటిల్లోనూ సత్తా చాటి, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దీంతో స్థానిక ఎన్నికలను పార్టీ అధిష్టానం కూడా సవాల్‌గానే తీసుకుంది. అయితే.. కూటమికి భగ్నం కాకుండా.. కూటమిలో సర్దుబాటు చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మిత్రపక్షమైన టీడీపీతో సమన్వయం చేసుకుంటూ, పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ స్థానాలను కేటాయించాలని పట్టుబట్టే అవకాశం ఉంది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ పశ్చిమ సీటును బీజేపీకి కేటాయించడం వల్ల, తాము నగరంలో త్యాగం చేయాల్సి వచ్చిందని జనసేన నేతలు భావిస్తున్నారు. అందువల్ల విజయవాడ మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 మేయర్ స్థానాలను టార్గెట్ చేసి జనసేన నాయకులు కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు.
విజయవాడతో పాటు అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో కూడా కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మేయర్ స్థానాలపై పోటీ నెలకొంది. ప్రత్యక్ష ఎన్నికలు కూడా దీనిని ప్రభావితం చేస్తున్నాయి. మేయర్లను నేరుగా ఓటర్లే ఎన్నుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ స్థానాలపై పోటీ మరింత తీవ్రమైంది. ఇక, ఈ అంశాలపై మంగళ, బుధవారాల్లో పవన్ కల్యాణ్ నేరుగా చర్చించనున్నారు.
This post was last modified on September 22, 2026 1:54 pm
ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…
సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…
డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…
ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…
సామాన్య జనాల్లోనే కాదు.. ఇండస్ట్రీ ప్రముఖుల్లోనూ పెద్ద సంఖ్యలో వీరాభిమానులను సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాము…
ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…