జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత జట్టు అనుభవం ముందు జపాన్ చాలా చిన్న జట్టు. అలాంటిది వాళ్ళు కొట్టినంతే కొట్టారు అనేలా కామెంట్స్ వస్తున్నాయి. హైవే పిచ్‌లపై 230, 250 పరుగులు కొట్టడం ఇప్పుడు పెద్ద విషయం కాదని ఇతర దేశాల అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఆ మధ్య ఐర్లాండ్‌తో ఓటమి తర్వాత ఈ కామెంట్లు మరింత పెరిగాయి.
బంతి బ్యాట్‌పైకి వచ్చే పిచ్‌లపైనే మన బ్యాటర్లు ఎక్కువగా పరుగులు చేస్తున్నారనే విమర్శ కూడా అప్పుడే వచ్చింది. జపాన్‌లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. పిచ్ పూర్తిగా నెమ్మదిగా ఉండటంతో స్పిన్నర్లకు మంచి సహకారం దొరికింది. ఐదు ఓవర్ల మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ నుంచి ఒక్క సిక్స్ కూడా రాలేదు. రెండు ఫోర్లు మాత్రమే వచ్చాయి. జపాన్ కూడా రెండు ఫోర్లే కొట్టింది. ఇలాంటి పిచ్‌పై భారీ షాట్లు కాకుండా బంతిని ఎలా ఆడుతున్నామన్నదే ముఖ్యం.
జపాన్ బౌలర్లు అదే పని చేశారు. పెద్దగా ప్రయోగాలు చేయకుండా లైన్ అండ్ లెంగ్త్ కరెక్ట్‌గా ఉంచారు. భారత బ్యాటర్లకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా బౌలింగ్ చేయలేదు. పిచ్ నెమ్మదిగా ఉందని తెలిసినా మన బ్యాటర్లు మాత్రం దానికి తగ్గట్టు ఇన్నింగ్స్ మార్చుకోలేకపోయారు.
బౌలింగ్‌లో అక్షర్ పటేల్ రెండు ఓవర్లలో ఆరు పరుగులే ఇచ్చాడు. ఆ స్పెల్ లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసినా రెండు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చాడు. ఇంత చిన్న లక్ష్యంలో అది చాలా ఎక్కువ. అక్షర్ కూడా అదే రేంజ్‌లో పరుగులు ఇచ్చి ఉంటే జపాన్ మ్యాచ్ తీసుకెళ్లేది. హైవే పిచ్‌లపై వచ్చే భారీ స్కోర్లను పక్కన పెడితే, ఇలాంటి పిచ్‌లపై మన బ్యాటింగ్ ఎక్కడ ఉందో జపాన్ మ్యాచ్ మరోసారి బయటపెట్టింది.
This post was last modified on September 22, 2026 4:49 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…