Political News

తెలంగాణ‌లో విచిత్రం… మంత్రుల అరెస్టు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు నిర‌స‌న‌లకు దిగారు. జిల్లాలు, మండ‌లాలు, నియోజక‌వ‌ర్గాల స్థాయిలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌స‌న‌గా ధ‌ర్నాలు చేప‌ట్టారు. రాజ‌ధాని హైద‌రాబాద్‌లో గ‌వర్న‌ర్ బంగ‌ళాను(లోక్‌భ‌వ‌న్‌) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ మ‌హేష్ గౌడ్ స‌హా ప‌లువురు మంత్రులు ముట్ట‌డించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంత్రుల‌తో పాటు ప‌లువురు నేత‌ల‌ను కూడా అరెస్టు చేశారు.

ఎందుకీ నిర‌స‌న‌?

కేంద్ర ప్ర‌భుత్వం విద్యావ్య‌వ‌స్థ‌కు సంబంధించి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును నిర‌సిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, ఎంపీ ప్రియాంక గాంధీలు స‌హా.. మిత్ర‌పక్షాల నాయ‌కులు సైతం మంగ‌ళ‌వారం మెరుపు నిర‌స‌న‌కు దిగారు. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. దీనికి నిర‌స‌న‌గా కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ప్ర‌జాస్వామ్యం గొంతు నొక్కుతున్నార‌ని, విద్యార్థుల భ‌విష్య‌త్తుతో ఆడుకుంటున్నార‌ని ఆరోపిస్తూ.. నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు.

తెలంగాణ‌లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయ‌కులు నిర‌స‌న‌కు దిగారు. హైద‌రాబాద్‌లో మ‌హేష్ కుమార్ గౌడ్‌.. ఆధ్వ‌ర్యంలో చ‌లో లోక్ భ‌వ‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. నెక్లెస్ రోడ్డు నుంచి గ‌వ‌ర్న‌ర్‌ బంగ‌ళా వ‌ర‌కు చేప‌ట్టిన నిర‌స‌న‌లో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స‌హా అనేక మంది పాల్గొన్నారు. అయితే.. ర్యాలీ గ‌వ‌ర్న‌ర్ భ‌వ‌న్ వ‌ర‌కు చేరుకున్నా.. అక్క‌డ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరుప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. అనంత‌రం.. పోలీసులు మంత్రులు స‌హా నేత‌ల‌ను అరెస్టు చేసి.. మ‌సాబ్‌ట్యాక్ స‌మీపంలోని పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఇక‌, రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లోనూ మంత్రులు ఈ నిర‌స‌న‌ల్లో పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లో జ‌రిగిన నిర‌స‌న‌లో పాల్గొన్నారు. అడ్లూరి ల‌క్ష్మ‌ణ్, కొండా సురేఖ స‌హా.. ఇత‌ర మంత్రులు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టిసిటిపేట్ చేశారు.  భారీ ఎత్తున కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల ను స‌మీక‌రించ‌డంతో ప‌లు ర‌హ‌దారులు కాంగ్రెస్ నిర‌స‌న కారుల‌తో నిండిపోయాయి.

ఇవీ డిమాండ్లు..

1)  రాహుల్‌గాంధీపై చేయి చేసుకున్న పోలీసుల‌ను త‌క్ష‌ణం స‌స్పెండ్ చేయాలి.
2)  ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్కేస్తున్న ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే గ‌ద్దె దిగాలి.
3) నీట్ ప‌రీక్ష లోపాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ..కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి.
4) విద్యార్థుల‌తో చ‌ర్చించి.. మృతి చెందిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం అందించాలి.
5) దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోడీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.

This post was last modified on July 22, 2026 8:20 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

5 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

15 hours ago