Political News

ధర్మేంద్ర ప్రదాన్… నాడలా, నేడిలా!

దేశ రాజధానిలో రగులుకున్న విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్తితి. ఈ పరిస్థితికి కారణం బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, కేంద్ర మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వ (విద్య) శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. నరేంద్ర మోదీ కేబినెట్ లో కీలక శాఖకు మంత్రిగా కొనసాగుతున్న ధర్మేంద్ర… నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు ఈ నిరసనలకు తెర తీశారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ప్రదాన్ ససేమిరా అంటున్నారు. మోదీ కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇలాంటి కీలక తరుణంలో ధర్మేంద్ర ప్రదాన్ కు సంబంధించిన ఓ అంశం పెద్ద చర్చకే తెర లేపింది.

19 శాతాబ్ధం చివరి అంకంలో అంటే… 1997లో ప్రదాన్ విద్యార్థిగా ఉన్నారు. నాడు ఆయన విద్యార్థి సంఘం నేతగా కూడా వ్యవహరించారు. విద్యార్థి సంఘం నేతలు అంటేె ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్తలే వారిని చూస్తే జడుసుకునే పరిస్థితి. సేమ్ టూ సేమ్ అలాగే నాడు విద్యార్థుల తరఫున ఉద్యమాలు సాగించిన ప్రదాన్… ఒడిశాలో ఓ పేపర్ లీకేజీ ఘటనపై ఉద్యమాన్ని నడిపారు. ఈ సందర్భంగా ఆయన భువనేశ్వర్ లోని ఒడిశా రాష్ట్ర సచివాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పేపర్ లీకేజీకి బాధ్యులను గుర్తించి కఠిన దండన విధించాలన్నది నాటి ప్రదాన్ డిమాండ్.

కట్ చేస్తే… నాడు పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ప్రదాన్ ఇప్పుడు ఏకంగా పేపర్ లీకేజీకి కారకుడిగా నిలిచారు. ఈ ఏడాది నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ప్రదాన్ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. రెండో పర్యాయం నిర్వహించిన నీట్ కూడా సక్రమంగా జరగలేదన్నది విద్యార్థి సంఘాల వాదన. ఈ క్రమంలో దేశ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విద్యార్థులంతా ప్రదాన్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రదాన్ రాజీనామా డిమాండ్ తో మొదలైన నిరసనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మరి ప్రదాన్ తనకు సంబంధించిన పాత సంగతులను నెమరు వేసుకుని రాజీనామా చేస్తారా?… లేదంటే నీట్ పేపర్ లీక్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్న తన పాత వాదననే కొనసాగిస్తారో చూడాలి.

This post was last modified on July 22, 2026 7:37 pm

Share

Recent Posts

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

3 minutes ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

6 minutes ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

1 hour ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

3 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

4 hours ago

కుబేర తర్వాత కమ్ముల ఏమయ్యారు

టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా సెన్సిబుల్ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్,…

5 hours ago