2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేనను గెలిపించిన పవన్ కల్యాణ్…ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో పవన్ తన మార్క్ చూపించారు. అదే సమయంలో ఏపీతో పాటు తెలంగాణలోనూ జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పవన్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.
ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరికలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు పవన్. అందుకోసం 14 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి జాయినింగ్స్ కమిటీని తాజాగా ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత జాయినింగ్స్ కమిటీతో ప్రత్యేకంగా పవన్ భేటీ కాబోతున్నారు. పార్టీలో చేరికలపై కమిటీ సభ్యులకు పవన్ దిశానిర్ధేశం చేయనున్నారు.
మరోవైపు, ఢిల్లీలో ‘ సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ 2వ రోజు సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 5 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
- వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు
- జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రతే జనసేన లక్ష్యం
- సంక్షోభం నుండి నమ్మకం వైపు: ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి.
- జనసేన @ 12 : త్యాగం, సేవ, ప్రజల నమ్మకం తాలూకు ప్రయాణం.
- యువతకు అండగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాల కల్పన
Gulte Telugu Telugu Political and Movie News Updates